పాలకుర్తిలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసిన ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-04-23T20:19:19+05:30 IST

రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత నియోజక వర్గమైన పాలకుర్తిలోని దేవరుప్పుల మండ‌లం సింగరాజు పల్లె గ్రామంలో నూత‌నంగా నిర్మించిన 40 డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను శనివారం ప్రారంభించారు..ఈ సంద‌ర్భంగా మంత్రి ఇండ్ల ప్రారంభ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి ఇండ్ల‌ను ల‌బ్ధిదా

పాలకుర్తిలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసిన ఎర్రబెల్లి

జనగామ జిల్లా: రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత నియోజక వర్గమైన పాలకుర్తిలోని దేవరుప్పుల మండ‌లం సింగరాజు పల్లె గ్రామంలో నూత‌నంగా నిర్మించిన 40 డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను శనివారం ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి ఇండ్ల ప్రారంభ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి ఇండ్ల‌ను ల‌బ్ధిదారులకు అప్పగించారు. అనంత‌రం జరిగిన కార్య‌క్ర‌మంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఇండ్లు పొందిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రం ఏమీ చేయకపోయినా, సహకారం లేకపోయినా సీఎం కేసిఆర్ మంచి అభివృద్ధిని చేసి చూపిస్తున్నారని అన్నారు. సీఎం కేసిఆర్ కృషి ఫలితమే ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లని అన్నారు. తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇండ్లు ఉన్నాయి.గతంలో కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అధోగతి పాలు అయింది. ఇన్నేండ్లలో మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు.


సిగ్గు లేకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్లకు తగిన బుద్ధి చెప్పండని ప్రజలకు పిలుపునిచ్చారు. సాగు నీళ్లు, చెరువులను బాగు చేసి, నింపిన ఘనత సీఎం కెసిఆర్ దే. మంచినీళ్ళు, 24 గంటల కరెంటు వస్తున్నది. రైతుల తరపున సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు, సబ్సిడీ కట్టి కరెంట్ ఇస్తున్నారు. సింగరాజు పల్లె కు ఎంత చేసినా రుణపడి ఉంటాను. నా వెన్నంటి ఉన్న గ్రామం ఇది. అందుకే ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాను. ఇండ్లు, సీసీ రోడ్లు, మెటల్ రోడ్లు, ఇచ్చిన. చెర్లకు నీళ్ళు తెచ్చాను. త్వరలోనే సెంట్రల్ లైటింగ్ వేస్తాను.


వడ్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీ లు దొంగ నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు. వడ్లు వద్దంటే, వేయమన్న రేవంత్, బండి సంజయ్ లు కంటికి కనబడకుండా పోయారు. అయినా సరే సీఎం కెసిఆర్ వడ్లను కొనుగోలు చేస్తున్నారు. బీజేపీ బడా ఝుటా పార్టీ. ఆ పార్టీ నేతల అబద్ధాలను నమ్మకండి.పొన్నాల లక్ష్మయ్య ఏండ్ల పాటు ఎమ్మెల్యే గా ఉన్నాడు. ఏడ పన్నాడు? ఆయన శాఖ కూడా అదే, అయినా ఏమీ చేయలేదు. నేను చెక్ డ్యాములు కట్టించాను.త్వరలోనే కొత్త పెన్షన్లు, మరిన్ని ఇండ్లు, సొంత జాగాలో ఇండ్లు ఇస్తామన్నారు.దళిత బంధు స్కీం దేశంలోనే ఎక్కడా లేని పథకం. సీఎం 3 ఏండ్ల లో ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చే విధంగా పథకాన్ని రూపొందించారు.త్వరలోనే మన ఊరు, మన బడి కింద సింగరాజు పల్లె ను ఎంపిక చేశాం. బడికి ప్రహరీ గోడ, మరుగుదొడ్లకు, అదనపు గదులకు మొత్తం 50 లక్షలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.

Updated Date - 2022-04-23T20:19:19+05:30 IST