ఆరోగ్య మేళాను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-04-18T23:07:32+05:30 IST

జిల్లాలోని తొర్రూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మేళా ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.

ఆరోగ్య మేళాను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

మహబూబాబాద్: జిల్లాలోని తొర్రూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మేళా ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య, పోలీసు, పంచాయ‌తీరాజ్, వివిధ శాఖ‌ల‌ సిబ్బంది, సేవలు అనిర్వచనీయమని.కోవిడ్ ను సమర్ధవతంగా ఎదుర్కొన్న అత్యుత్తమ  రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా ఉందని జాతీయ ఆర్థిక సర్వే ప్రశంసించిందని గుర్తుచేశారు. ఇంటింటి జ్వర సర్వే జాతీయ స్థాయి లో బెస్ట్ ప్రాక్టీస్ గా నీతి  ఆయోగ్ గుర్తించి ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సూచించిందని అన్నారు.సీఎం కేసిఆర్ ప్ర‌జ‌ల ఆరోగ్య ర‌క్ష‌ణ‌, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు న‌డుం బిగించారు.స్వచ్ఛమైన గాలి కోసం హరిత హారం, స్వచ్ఛమైన నీటి  కొరకు మిషన్ భగీరథ, పరిశుభ్రత కోసం పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అమ‌లు అవుతున్నాయని మంత్రి తెలిపారు. ఆహార భద్రత కోసం మిషన్ కాకతీయ, సాగు నీటి ప్రాజెక్టులు  నిర్మించారు. ఫలితంగా ఇప్పుడు తెలంగాణ నలుగురికి అన్నం పెట్టే స్థాయికి పెరిగిందని అన్నారు. 


 ఆరోగ్య తెలంగాణ సాధ‌న‌కు కేసిఆర్ నిరంత‌రం శ్ర‌మిస్తున్నారు.అన్ని స్థాయిల్లో ఉన్న సర్కారు దవాఖానలను అభివృద్ధి చేశారు.ఎనిమిదేళ్ల క్రితం నేను రాను బిడ్డో స‌ర్కార్ ద‌వాఖాన‌కు అనే ప‌రిస్థితి ఉండ‌గా, ఇప్పుడు నేను వ‌స్త బిడ్డో స‌ర్కార్ ద‌వాఖాన‌కే అనే ప‌రిస్థితి వ‌చ్చిందన్నారు. ప్రతి హాస్పిటల్ లో తగినంత సిబ్బంది, కోట్ల విలువైన 30 వేల పరికరాలు స‌మ‌కూరాయి. ఇప్పుడు టెస్టులు, స్కానింగులు, డ‌యాల‌సిస్‌, ఒక‌టేంటి వైద్య‌మంతా ఉచితం.పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు తగ్గాయి.ఆరోగ్య సూచికలలో కూడా గణనీయమైన పురోభివృద్ధి సాధించాం.వైద్యరంగంలో తెలంగాణ చేస్తున్న కృషిని పార్ల‌మెంట్‌ ప్రశంసించింది.వైద్య సేవల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 3వ‌ స్థానంలో ఉందని మంత్రి వివరించారు.


వైద్య సేవల కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తలసరి ఖర్చు 1698 రూపాయలని అన్నారు. ప్ర‌భుత్వ త‌ల‌స‌రి వైద్య ఖ‌ర్చు రూ. 3,092కు చేరుకుంది. ఈ విష‌యంలో గుజ‌రాత్ రూ. 1821, రాజ‌స్థాన్ రూ. 2646, మ‌ధ్య ప్ర‌దేశ్ రూ.1716, కేర‌ళ రూ. 2874, క‌ర్ణాటక రూ. 2151 కంటే మనం ముందున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికార యంత్రాంగం, వైద్య అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.


Updated Date - 2022-04-18T23:07:32+05:30 IST