ఈ ఏడాది విద్యం, వైద్యంపైనే కేసీఆర్ దృష్టి పెట్టారు: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-04-18T20:48:07+05:30 IST

జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో వెల్స్ ఫార్గో, యునైటెడ్ వే స్వచ్చంద సంస్థల సహకారంతో 70 లక్షల రూపాయల వ్యయంతో క్రిటికల్ కేర్, కోవిడ్ -19 రోగుల చికిత్స కోసం నిర్మించిన అత్యధునాతన 36 పడకల భవనాన్ని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిఎర్రబెల్లి దయాకరరావు మరో మంత్రిసత్యవతిరాధోడ్ కలిసి సోమవారం ప్రారంభించారు,

ఈ ఏడాది విద్యం, వైద్యంపైనే కేసీఆర్ దృష్టి పెట్టారు: మంత్రి ఎర్రబెల్లి

మహబూబాబా: జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో వెల్స్ ఫార్గో, యునైటెడ్ వే స్వచ్చంద సంస్థల సహకారంతో 70 లక్షల రూపాయల వ్యయంతో క్రిటికల్ కేర్, కోవిడ్ -19 రోగుల చికిత్స కోసం నిర్మించిన అత్యధునాతన 36 పడకల భవనాన్ని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిఎర్రబెల్లి దయాకరరావు మరో మంత్రిసత్యవతిరాధోడ్ కలిసి  సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ  వైద్య సదుపాయాలు కల్పించిన స్వచ్ఛంద సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు.ఏడేళ్ల కింద ఈ ప్రాంతం ఎలా ఉండేది ఇపుడు ఎలా ఉంది? అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు.గతంలో ఇక్కడ తాగునీటి, సాగునీటి, కరెంట్ కష్టాలు ఉండేవి. ఇపుడు సస్య శ్యామలం అయ్యింది.ఈ ఏడాది విద్య, వైద్యం మీద సీఎం కేసిఆర్ దృష్టి పెట్టారు.మహబూబాబాద్ కు మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ వచ్చింది.రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఛాలెంజ్ గా పని చేసి ప్రభుత్వ హాస్పిటల్స్ ను బాగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.


దేశంలో ఎక్కడా లేని విధంగా వరంగల్ లో 1100 కోట్ల రూపాయలతో హాస్పిటల్ కడుతున్నారు.సీఎం కేసిఆర్ మహబూబాబాద్ జిల్లా రూపు రేఖలు మార్చారని అన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఇక్కడి ప్రజల కోసం 36 పడకల భవనం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసిఆర్ నాయకత్వంలో మారుమూల ప్రాంతాల్లో కూడా హైదరాబాద్ లో ఉండే వైద్య వసతులు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. గిరిజనులు అధికంగా ఉన్న ఈ జిల్లాలో నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీలు వచ్చాయి.ఏరియా హాస్పిటల్ ను జిల్లా హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేసుకున్నాం. టీ. డయాగ్నస్టిక్ కేంద్రం ప్రారంభం చేసుకుని అనేక విలువైన పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని తెలిపారు.


30 ఐసీయు బెడ్లు ఉన్నాయి. అత్యాధునిక వసతులు ఉన్నాయి. కార్పొరేట్ వైద్యానికి తగ్గకుండా ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యం అందిస్తున్నామని మంత్రి తెలిపారు.ఈ ప్రారంభోత్సవంలో ఎంపీ మాలోతు కవిత, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్సీ తక్కెల్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-18T20:48:07+05:30 IST