జనగామలో మొదటి కొనుగోలు కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2022-04-16T00:56:43+05:30 IST

ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించింది.

జనగామలో మొదటి కొనుగోలు కేంద్రం ప్రారంభం

జనగామజిల్లా: ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామా రెడ్డి గూడెంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్ట మొదటి కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. దీనిని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర రైతు బంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.వడ్ల రాశి పై గులాబీ రంగులో జై కెసీఆర్ అని రాశారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ గోదావరి నీటిని మన ఇండ్లకు, పొలాలకు తెచ్చిన ఘనత మహానుభావుడైన సీఎం కెసిఆర్ కే దక్కుతుందన్నారు.కాంగ్రెస్, బీజేపీ లు నీళ్ళ కోసం అలమటిస్తున్న ప్రజలని ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. 


కానీ సీఎం కేసిఆర్ నీళ్ళతోపాటు 24 గంటల కరెంటు ఇస్తున్నారని అన్నారు.సీఎం కేసిఆర్ రైతుల పక్షపాతి కనుకే రైతుల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా, 3 వేల కోట్ల నష్టం వస్తున్నా, వడ్లు మళ్ళీ కొనుగోలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఈసందర్భంగా రైతుబంధు ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చెప్పిన మొదటి రోజే సమీక్షించి, రెండో రోజే ఉమ్మడి వరంగల్ జిల్లా లో మొట్టమొదటి వడ్ల కొనుగోలు కేంద్రాన్నిప్రారంభించామన్నారు. ఇంత తక్కువ టైంలో రెడీ చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. బియ్యం కొనుగోలు చేసే బాధ్యత కేంద్రం దే. ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు సాగుతుందన్నారు.ధాన్యం కొనుగోళ్లలోకేంద్రం చేతులు ఎత్తేసింది.సీఎం కేసీఆర్ స్వయంగా కేంద్రానికి లేఖ స్పందించలేదన్నారు.రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్న సీఎం కెసిఆర్ మాత్రం నష్టం వచ్చినా సరే, కొనాలని నిర్ణయించారని తెలిపారు.


Updated Date - 2022-04-16T00:56:43+05:30 IST