హన్మకొండ: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు సేవా సహకార భవనాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యం తో తెలంగాణ అభివృద్ది లేదు.కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, అనేక సంక్షేమ పథకాల తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. నందనం గ్రామం లో చెక్ డ్యామ్ కట్టించినా, కరెంట్ కోతలతో రైతులు ఆందోళన చేసేవారు. కాని, ఇప్పుడు కేసీఆర్ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చారు. బిజెపి ప్రభుత్వం రైతులకు మీటర్లు పెట్టాలని కుట్ర పన్నింది.కానీ కేసీఆర్ దానికి ఒప్పుకోలేదని తెలిపారు.
వచ్చే వర్షాకాలం లోగా ఐనవోలు మండలానికి సాగు నీరు అందించేలా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.
గతం లో నీళ్ళ కోసం కొట్లాడి జైల్ కు పోయిన కాని, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఉచితంగా నీరు అందిస్తున్నారు. రైతుల రుణాలు మాఫీ చేసిన ఘనత కేసీఆర్ దేనని అయితే, అలాగే రైతులకు పెట్టుబడి ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు.కొత్త పెన్షన్ లు కూడా రేపటి నుంచి వస్తున్నాయని తెలిపారు. బిజెపి ప్రభుత్వం వంచన చేస్తుందని బియ్యం కొనుగోలు లో ఆంక్షలు పెడుతుందని తెలిపారు. ధాన్యం కొనమంటే కొనడం లేదని, బీజేపీ అంటేనే బోగస్ పార్టీ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎద్దేవా చేశారు. అలాంటి నేతలను మన గ్రామాల్లో నుండి తరిమి వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి రమేష్, డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి