వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఎర్రబెల్లి శంకుస్ధాపన

ABN , First Publish Date - 2020-10-18T21:59:34+05:30 IST

గతంలో ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటారో, ఎక్కడ దొరుకుతారో ప్రజలకు తెలిసేది కాదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేకు క్యాంపు కార్యాలయం నిర్మించుకునేందుకు అవకాశం లభించిందని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఎర్రబెల్లి శంకుస్ధాపన

వరంగల్‌: గతంలో ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటారో, ఎక్కడ దొరుకుతారో ప్రజలకు తెలిసేది కాదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేకు క్యాంపు కార్యాలయం నిర్మించుకునేందుకు అవకాశం లభించిందని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం వరంగల్‌ తూర్పు నియోజక వర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఆయన శంకుస్ధాపన చేశారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రజలను కలవాలంటే గతంలో ఎమ్మెల్యేలకూ ఇబ్బందిగానే ఉండేదన్నారు. అనేక మంది ఎమ్మెల్యేల ఇళ్లు ఇరుకుగా ఉండడం, సదుపాయాలు ఉండేవి కావన్నారు. సీఎం కేసీఆర్‌ శాసన సభ్యులు నియోజక వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజక వర్గ కేంద్రంలో క్యాంపు కార్యాలయాల నిర్మాణం చేపట్టారని అన్నారు. 


ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో క్యాంపు కార్యాలయాల నిర్మాణం పూర్తయ్యాయని తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ దాదాపు అన్ని క్యాంపు కార్యాలయాల నిర్మాణం పూర్తయ్యాయని చెప్పారు. ఒకటి రెండు నియోజక వర్గాల్లో మాత్రమే కాం్యపు కార్యాలయాలు స్థలాలు అందుబాటులో లేకపోవడంతో ఆలస్యంమయ్యాయని తెలిపారు. 


ఆలస్యమైనా సరే వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే మంచి స్థలాన్ని ఎంచుకున్నారు. నిర్ణీత సమయంలో క్యాంపు కార్యాలయాన్నిపూర్తిచేసేలా అధికారులు పనులు వేగంగా పూర్తిచేయాలన్నారు. వరంగల్‌ నగరంలోని అణువు అణువు నాకు తెలుసు. వరంగల్‌ను అద్దంలా అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఎక్కడెక్కడ ఏయే అవసరాలున్నాయో నాకు తెలుసునని ఎర్రబెల్లిచెప్పారు. నియోజక వర్గం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ వరంగల్‌ తూర్పు నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా దొరకడం అదృష్టమని చెప్పారు.  


Updated Date - 2020-10-18T21:59:34+05:30 IST