ప‌కడ్బందీగా ప‌ట్ట‌భద్రుల ఓట్ల న‌మోదు- మంత్రి ఎర్ర‌బెల్లి

ABN , First Publish Date - 2020-09-27T22:47:22+05:30 IST

ప‌క‌డ్బందీగా ఓట్ల న‌మోదు చేయ‌డంతోపాటు వ‌చ్చే వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఘ‌న‌ విజ‌యాన్ని కూడా న‌మోదు చేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.

ప‌కడ్బందీగా ప‌ట్ట‌భద్రుల ఓట్ల న‌మోదు- మంత్రి ఎర్ర‌బెల్లి

పెద్ద వంగ‌ర: ప‌క‌డ్బందీగా ఓట్ల న‌మోదు చేయ‌డంతోపాటు వ‌చ్చే వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఘ‌న‌ విజ‌యాన్ని కూడా న‌మోదు చేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. ప‌ట్ట‌భద్రుల స‌న్నాహ‌క స‌మావేశాన్ని మ‌హ‌బూబాబాద్ జిల్లా పెద్ద వంగ‌ర మండ‌ల కేంద్రంలో ఆదివారం మంత్రి నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత ప్ర‌తి ఎన్నిక‌లోనూ టిఆర్ ఎస్ విజ‌య‌దుందుభి మోగిస్తున్న‌ద‌ని, ఆ ఒర‌వ‌డిని కొన‌సాగించాల‌ని పార్టీ శ్రేణుల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. ప‌ట్ట‌భ‌ద్రుల‌ను గుర్తించ‌డం, వారిని ఓట‌ర్లుగా న‌మోదు చేయ‌డం, అలాగే వాళ్ళంద‌రూ టిఆర్ఎస్ అభ్య‌ర్థికే ఓటు వేసే విధంగా త‌యారు చేయ‌డం వంటి బాధ్య‌త‌ల‌ను పార్టీ శ్రేణుల్లో బాధ్యులు తీసుకోవాల‌న్నారు.


గ్రామాల్లో వార్డుల వారీగా, బూత్ ల వారీగా ఇప్ప‌టికే ఇన్ చార్జీల‌ను పెట్టామ‌ని వాళ్ళంతా వారివారి క్షేత్రాల్లో ప‌నులు నిర్వ‌ర్తించాల‌ని చెప్పారు. ఏమైనా స‌మ‌స్య‌లుంటే, వెంట‌నే త‌మ దృష్టికి తేవాల‌ని, నిర్ల‌క్ష్యంగా ప‌ని చేసే వారిని క్ష‌మించేద‌ది లేద‌ని మంత్రి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, పార్టీ బాధ్యులు, ఎన్నిక‌ల ఇన్ చార్జీలు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-27T22:47:22+05:30 IST