పర్యాటక ప్రాంతంగా అన్నారం షరీఫ్‌, పర్వతగిరి- ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-07-10T20:46:56+05:30 IST

రూర్బన్‌ ప్రాజెక్టు పర్వతగిరి అభివృద్ధికి పర్‌ఫెక్ట్‌గా సరిపోతుందని ఈ ప్రాంత అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించామని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అన్నారు.

పర్యాటక ప్రాంతంగా అన్నారం షరీఫ్‌, పర్వతగిరి- ఎర్రబెల్లి

వరంగల్‌రూరల్‌: రూర్బన్‌ ప్రాజెక్టు పర్వతగిరి అభివృద్ధికి పర్‌ఫెక్ట్‌గా సరిపోతుందని ఈ ప్రాంత అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించామని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అన్నారు. ఇక్కడి ప్రజల అవసరాలకనుగుణంగానే ఆయా అభివృద్ధి పనులను మొదటి విడతగా వచ్చిన 30కోట్లతో త్వరలోనే చేపడతామని అన్నారు. రూర్బన్‌ ప్రాజెక్ట్‌కింద మంజూరైన మొదటి విడత నిధులలో భాగంగా ఖరారైన పనులను స్వయంగా మంత్రి ఎర్రబెల్లి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరిరమేష్‌తో కలిసి పరిశీలించారు. ఈసందదర్భంగా పర్వతగిరి ఊర చెరువువద్ద మొక్కలు నాటారు. చెరువుకట్టను పరిశీలించారు. చెరువును విశాలం చేయాలన్నారు. వచ్చే ఏడాది నుంచి దసరా ఉత్సవాలు అక్కడే జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత అన్నారం దర్గా చెరెవును కూడా మంత్రి పరిశీలించారు. కట్టవెంట నడిచారు. చె రువును పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. 


చెరువునే కాదు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈసందర్భంగా ఆయన మొక్కలు నాటి దర్గాను దర్శించుకున్నారు. దారిలో తనకు ఎదురైన పలువురు ఉపాధి హామీ కూలీలకు మంత్రి మాస్క్‌లను పంపిణీ చేశారు. రూర్బన్‌ ప్రాజెక్ట్‌నిధులపై తానుగతంలో ఎంపీగా పనిచేసినప్పుడే అవగాహనతో పనిచేసినట్టుచెప్పారు. మధ్యలో ప్రాజెక్ట్‌ను నిలిపివేశారు. తర్వాత సీఎం కేసీఆర్‌ ద్వారా కేంద్రానికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తిచేశాం. అనేక ప్రయత్నాల తర్వాత మొదటి విడతగా 30కోట్లరూపాయలు మంజూరయ్యాయని చెప్పారు. ఈ నిధులతో పర్వతగిరి ప్రాంతాన్నిఅభివృద్ది చేస్తామన్నారు అన్నారం షరీఫ్‌, పర్వతగిరిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.


స్థానిక ప్రజలు ప్రజా ప్రతినిధుల సహకారంతో అన్నారం రోడ్డు పోడవునా షట్టర్లు వేసి ఇవ్వాలని, మాంసం కేంద్రం నిర్మించాలని, కబేళాను కట్టించాలని, స్కూల్‌ భవనాన్ని నిర్మించానలి, ప్రస్తుత స్కూల్‌ ఉన్న ప్రాంతంలో బస్టాండ్‌ నిర్మించాలని భావిస్తున్నామన్నారు. ఈ ప్రాంతం వాడిగా దీనిని అభివృద్ధి పరిచి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని మంత్రి తెలిపారు. దీనికి ప్రజల సహకారం కావాలన్నారు. మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మంత్రి వెంట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌తో పాటు వివిధ శాఖల అధికారులు ఉన్నారు. 

Updated Date - 2020-07-10T20:46:56+05:30 IST