Advertisement
Advertisement
Abn logo
Advertisement

గ్రామీణ ప్రాంతాల సమగ్ర పురోగతికి కట్టుబడి ఉన్నాం: ఎర్రబెల్లి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి చేపట్టి అమలు చేస్తున్న వివిధ గ్రామీణ అభివృద్ధి పథకాలను విజయవంతంగా అమలు చేయడానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు అంకితభావంతో, చిత్తశుద్ధితో కృషిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న 57 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులుగా పదోన్నతి పొందిన సందర్భంగా పదోన్నతి పొందిన అధికారులు, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం, మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం భాద్యులు సోమవారం నాడు హైదరాబాదులోని ఖైరతాబాద్ మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.


రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో  అమలు చేయబడుతున్న వివిధ గ్రామీనాభివృద్ధి కార్యక్రమాలు పంచాయతీ అధికారులు, ఉద్యోగుల కృషివల్ల విజయవంతంగా అమలు అవుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రమోషన్ పొందిన అధికారులు, ఇతర అధికారులు అదే స్ఫూర్తితో మరింతగా పని చేసి క్షేత్రస్థాయిలో గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని ఆయన ఉద్బోధించారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను ప్రమోషన్ ద్వారా భర్తీ చేశామని ఆయన అన్నారు.

Advertisement
Advertisement