Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే: ఎర్రబెల్లి

హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది బాధ్యత గల పౌరులుగా తీర్చి దిద్దుతున్న, గురువుల సేవలు వెలకట్టలేనివని ఆయన అన్నారు. దేశానికి తలమానికంగా రాష్ట్ర విద్యారంగాన్ని రూపుదిద్దే మహా యజ్ఞంలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని కోరారు.


రాష్ట్రంలో విద్య అభివృద్ధి కోసం మెరుగైన సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు.విద్యాలయాలు తిరిగి ప్రారంభమై నందున ఉపాధ్యాయులు కోవిడ్  నిబంధనలు పాటిస్తూ, విద్యార్థుల  ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ విద్యను అందించాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు.

Advertisement
Advertisement