Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంత్రి ఎర్రెబెల్లిని కలిసిన జనగామ జిల్లాకలెక్టర్

హైదరాబాద్: జనగామ జిల్లా నూతన కలెక్టర్ గా నియమితులైన శివలింగయ్య  బుధవారం ఉదయం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గల మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా మంత్రి ఆయనకు అభినందనలు తెలిపి జనగామ జిల్లా అభివృద్ధికి పాటుపడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు అందరికి అందేలా అహర్నిశలు కృషి చేయ్యలని అయన కోరారు.

Advertisement
Advertisement