ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు కల్పించండి

ABN , First Publish Date - 2020-11-25T05:18:05+05:30 IST

ఖానాపూర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో ప్రజల సౌకర్యార్థమై మరిన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను స్థానిక ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ కోరారు.

ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు కల్పించండి
మంత్రి ఈటెల రాజేందర్‌ను కలిసిన ఎమ్మెల్యే రేఖానాయక్‌

ఆరోగ్యశాఖ మంత్రికు ఎమ్మెల్యే రేఖానాయక్‌ విన్నపం

ఖానాపూర్‌, నవంబరు 24: ఖానాపూర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో ప్రజల సౌకర్యార్థమై మరిన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను స్థానిక ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ కోరారు. మంగళ వారం హైదరాబాద్‌లోని సెక్రెటెరియట్‌లో మంత్రి ఈటెలను కలిసి స్థానికం గా ఉన్న ఆస్పత్రిలో కల్పించాల్సిన వసతులను వివరించారు. ఖానాపూర్‌ ఆస్పత్రిని ఉన్నతీ కరించడంతో పాటు నియోజకవర్గంలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల మరింత అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. ప్రభు త్వం వైధ్యరంగంపై ప్రత్యేకశ్రద్ధ చూపుతోందని, తాము వివరించిన సమస్య లపై మంత్రి సానుకూలంగా స్పందించారని రేఖానాయక్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ గంగనర్సయ్య, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు తాళ్ళపెల్లి రాజగంగన్న, కొక్కుల ప్రదీప్‌, పుప్పాల శంకర్‌, పరిమి సురేష్‌, కోడిమ్యాల వీరేష్‌, గోవింద్‌, చరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఈటెలను కలిసిన మండల నాయకులు

పెంబి: రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను హైదరాబాద్‌లోని ఆయన ఛాంబర్‌లో మంగళవారం ఎమ్మెల్యే రేఖానాయక్‌తో పాటు పెంబి, ఖానాపూర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.   మండలంలో మెరుగైన వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసు కోవాలని ఆయన కోరారు. ఇందులో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్‌, ఏఎంసీ చైర్మన్‌ కడార్ల గంగనర్సయ్య, రైతుబంధు మండల కన్వీనర్‌ భుక్య గోవింద్‌, కొక్కుల ప్రదీప్‌, రాజ్‌ గంగన్న పాల్గొన్నారు.

Updated Date - 2020-11-25T05:18:05+05:30 IST