ఖుష్బూకు గుడి కట్టినప్పుడు.. ఎంజీఆర్‌కు కట్టడం తప్పుకాదు

ABN , First Publish Date - 2022-06-11T16:01:37+05:30 IST

సినీనటి ఖుష్బూకు అభిమానులు గుడికట్టగా, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌కు గుడికట్టడం తప్పె లా అవుతుందని.. కాదని రాష్ట్ర నీటివనరుల శాఖ

ఖుష్బూకు గుడి కట్టినప్పుడు.. ఎంజీఆర్‌కు కట్టడం తప్పుకాదు

                                  - మంత్రి దురైమురుగన్‌


చెన్నై, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): సినీనటి ఖుష్బూకు అభిమానులు గుడికట్టగా, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌కు గుడికట్టడం తప్పె లా అవుతుందని.. కాదని రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌ వ్యాఖ్యానించారు. వేలూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల కంట్రోలు రూమ్‌ను శుక్రవారం ఉదయం ఆయన ప్రారంబించారు.ఆ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ వేలూరు జిల్లాలో ద్విచక్రవాహనాలు నడిపేవారు, వారితోపాటు ప్రయాణించేవారు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని స్థానిక పోలీసు అధికారులు జారీచేసిన ఉత్తర్వు సమంజసమేనని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో నూటికి 80 మంది హెల్మెట్లు ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని, చెప్పారు. కాట్పాడి వద్ద ఎంజీఆర్‌ వీరాభిమాని ఒకరు గుడి కట్టేందుకు చేస్తున్న ప్రయత్నం గురించి విలేఖరులు ఆయన ప్రస్తావించినప్పుడు నటి ఖుష్బూకే గుడి కట్టినప్పుడు ఎంజీఆర్‌కు గుడికట్టడం తప్పుకాదని బదులిచ్చారు.రాష్ట్రంలో ద్రావిడ సిద్ధాంతాలను అనుసరిస్తున్న ఏకైక పార్టీ డీఎంకే మాత్రమేనని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ కదిర్‌ ఆనంద్‌, మేయ ర్‌ సుజాత, ఎస్పీ రాజేష్‌ ఖన్నా, వేలూరు ఎమ్మెల్యే కార్తికేయన్‌, కలెక్టర్‌ కుమరవేల్‌ పాండ్యన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-11T16:01:37+05:30 IST