మెకెదాటుపై రాజీపడే ప్రసక్తే లేదు

ABN , First Publish Date - 2022-06-16T14:55:20+05:30 IST

రాష్ట్ర హక్కులకు భంగం వాటిల్లే ఏ ప్రయత్యాన్ని అంగీకరించబోమని, మెకెదాటు వ్యవహారంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రజాపనుల శాఖ మంత్రి

మెకెదాటుపై రాజీపడే ప్రసక్తే లేదు

                                     - మంత్రి దురైమురుగన్‌


వేలూరు(చెన్నై), జూన్‌ 15: రాష్ట్ర హక్కులకు భంగం వాటిల్లే ఏ ప్రయత్యాన్ని అంగీకరించబోమని, మెకెదాటు వ్యవహారంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రజాపనుల శాఖ మంత్రి దురైమురుగన్‌ స్పష్టం చేశారు. పట్ణణంలో ‘ద్రావిడ మోడల్‌’ పాలనపై కార్యకర్తల శిక్షణ బుధవారం ఆనైకట్టు ఎమ్మెల్యే నందకుమార్‌ అధ్యక్షతన జరిగింది. మంత్రి దురైమురుగన్‌, వేలూరు ఎంపీలు కదిర్‌ ఆనంద్‌, రాజా, వేలూరు ఎమ్మెల్యే కార్తికేయన్‌, వేలూరు మేయర్‌ సుజాత తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దురైమురుగన్‌ మీడియాతో మాట్లాడుతూ, మెకెదాటు డ్యాం నిర్మాణానికి అంగీకరించొద్దని ఇప్పటికే ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రధానికి లేఖ రాశారన్నారు. తమిళనాడు ప్రభుత్వ తీరుపై కర్ణాటక ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర హక్కులు భంగం కలిగించే ఎలాంటి నిర్ణయాలను తాము అంగీకరించబోమని, మెకెదాటు నిర్మాణాన్ని అడ్డుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - 2022-06-16T14:55:20+05:30 IST