ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా..

ABN , First Publish Date - 2021-10-15T06:41:17+05:30 IST

ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా..

ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా..
మహిళలతో కలిసి కోలాటం ఆడుతున్న మంత్రి దయాకర్‌రావు

ఆడబిడ్డల పండుగ బతుకమ్మ  

రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

 తొర్రూరు, అక్టోబరు 14: నిత్యం ప్రజల మద్యే ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని తెలంగాణ సం స్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆడబిడ్డల పండుగ బతుకమ్మ పండుగ అని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. గురువారం సాయం త్రం డివిజన్‌ కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలతో కోలాటం ఆడి స్టెప్పులు వేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఉన్నా తొర్రూ రు పట్టణ కేంద్రంలో జరిగే వేడుకల్లో పాల్గొంటానని, ఇక్కడ ఆడపడుచులు ఎంతో కలిసి మెలిసి ఉంటారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని, గత రెండు సంవత్సరాలుగా ప్రజలు కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్నారని, వారందరిని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. కరోనా చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు చేసి చికిత్స అందించామన్నారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చా రు. ప్రజలు పండుగ సమయంలో ఒకేచోట చేరి వేడుకలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు.

 ప్రజలందరికి సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆర్డీవో రమేష్‌, మునిసిపల్‌ చైర్మన్‌ రాంచంద్రయ్య, వైస్‌చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, కమిషనర్‌ బాబు, మహిళా కౌన్సిలర్‌లు చకిలేల అలివేణి నాగరాజు, దొంగరి రేవతి శంకర్‌, కర్నె నాగజ్యోతి, దరావత్‌ సునీత జైసింగ్‌, తూనం రోజా ప్రభు, సంగీత రవి, యమున జంప, బిజ్జాల మాధవి అనిల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కాకిరాల హరిప్రసాద్‌, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ సోమేశ్వర్‌ రావు, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు బిందు శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-15T06:41:17+05:30 IST