Abn logo
Sep 26 2021 @ 00:45AM

పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

మంత్రి దయాకర్‌రావు

పెద్దవంగర, సెప్టెంబర్‌ 25: టీఆర్‌ఎస్‌ పార్టీలో కార్యకర్తలకు, ముఖ్యనాయకులకు సరైన సమయంలో తగిన గుర్తింపును ఇస్తామని రాష్ట్రపంచాయతీరాజ్‌ శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో కొవిడ్‌ టీకా కేంద్రాన్ని పరిశీలించి కార్యకర్తలతో మండల విస్తృతస్థాయి సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీలో ప్రతీ కార్యకర్త ఓ శక్తిగా ఎదగాలని మంత్రి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ప్రతీ కార్యకర్త కష్టాన్ని గుర్తించి తగిన అవకాశం ఇస్తామని, ప్రస్తుతం ఏర్పాటువుతున్న గ్రామ, మండల కమిటీలలో స్థానం లభించకపోయినా నిరాశ పడవద్దని అవకాశం వచ్చినప్పుడు అందరీ అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పార్టీలో గ్రూపులు కడితే సహించేది లేదున్నారు. అందరీకి పదవులు రావని, వారి నైపుణ్యం, అనుభవాన్ని బట్టి జిల్లా కమిటీలలో స్థానం కల్పిస్తామని అన్నారు. పార్టీ అభ్యున్నతి కోసం కష్టపడిన పనిచేసిన వారికి మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. ప్ర తి పక్షాల విమర్శలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దళితుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ఉద్యమ తరహాలో అమలు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో దళితబంధు వలె అన్ని వర్గాల ప్రజలకు పథకాలను అందించే యోచనలో సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. దళితబంధు పథకం ప్రతి సంవత్సరం రూ.25వేల కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. వచ్చే సీజన్‌లో సన్నరకం వరి ధాన్యం పం డించాలని, ప్రతామ్నాయ పంటలను సాగు చేసి అధిక లాభాలు పొందాలన్నారు. దేశానికి బీజేపీ ఒరగబెట్టింది ఏమి లేదని, కేసీఆర్‌తోనే దేశంలో సుభిక్షపాలన సాధ్యమని చెప్పారు. దేశంలో ఇతర రాష్ర్టాల ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలను కాపీ కొడుతున్నాయనీ, రైతుబందు పథకాన్నీ ఏకంగా ప్రధాని మోదీయో నకల్‌ కొట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులతో రైతులకు ఒరిగేదేమి లేదని, కార్పొరేట్‌ సంస్థలకు లాభం కలిగించే విధంగా ఉన్నాయన్నారు. పెద్దవంగర మండలాభివృద్ధికి సమన్వయంతో పనిచేస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్‌ కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి కట్టుగా పని చేసి కరోనాను ఎదుర్కోవాలని సూచించారు. 

టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్యను ప్రకటించారు. అనంతరం బొమ్మకల్లు గ్రామంలో ఇటీవల మరణించిన పొడిశెట్టి వెంకన్న, ధనమ్మ, కుటంబసభ్యులను, రోడ్డు ప్రమాదంలో గాయపడిన యూత్‌ నాయకుడు రాంమూర్తిని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు జన్ను జకార్య, గుడి వంశీఽధర్‌రెడ్డి, మాజీ జేసీసీ చైర్మన్‌ గాంఽధీనాయక్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థాన చైర్మన్‌ రామచంద్రయ్యశర్మ, రైతుబంధు సమి తి జిల్లా, మండల నాయకులు నెహ్రునాయక్‌, సోమన్సింహారెడ్డి, మండల రైతుబంధు సమితి కన్వీనర్‌ సోమారెడ్డి, నాయకులు యాదగిరిరావు, శ్రీరాం సుధీర్‌, ముత్తినేని శ్రీనివాస్‌, సమ్మయ్య, సుధాకర్‌, రాజుయాదవ్‌, కాసాని హరీ్‌షయాదవ్‌, లింగమూర్తి, శ్రీనివాస్‌, శ్రీరాం రాము, తదితరులు పాల్గొన్నారు