క్రీడాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి

ABN , First Publish Date - 2020-10-24T11:14:02+05:30 IST

మహబూబ్‌నగర్‌ జిల్లాలో క్రీడల అభివృద్ధి, మళిక సదుపాయాల కల్పన కోసం క్రీడాశాఖాధికారులు, జిల్లా క్రీడా సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో

క్రీడాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి

పాలమూరు, అక్టోబరు 23: మహబూబ్‌నగర్‌ జిల్లాలో క్రీడల అభివృద్ధి, మళిక సదుపాయాల కల్పన కోసం క్రీడాశాఖాధికారులు, జిల్లా క్రీడా సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాను క్రీడల్లో రాష్ట్రంలోనే ఆదర్శంగా అగ్రగామిగా నిలపాలన్నారు. మహబూబ్‌నగర్‌ ప్రధాన స్టేడియంలో రూ.2.50 కోట్లతో ఆధునీకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. రూ.2.65 కోట్లతో నూతన స్టేడియం నిర్మాణం కోసం ప్రతిపాదనలు రూపొందించి, స్థలసేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో నూతన వాలీబాల్‌ అకాడమిని ఏర్పాటు చేసి, ఇతర క్రీడాలనూ అకాడమీలో చేర్చాలన్నారు. త్వరలోనే వాలీబాల్‌ అకాడమీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలన్నారు.


కోచ్‌లను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయిలో మల్టీపర్పస్‌ ఇంటిగ్రేటెడ్‌ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్‌ ప్రధాన స్టేడియంలో సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని క్రీడల అభివృద్ధి కోసం ఐదుగురు సభ్యులతో డీవైఎస్‌ఓ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. మహబూబ్‌నగర్‌ క్రీడల అభివృద్ధి సంధానకర్తగా శాట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో శాట్స్‌ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి, జిల్లా ఒలింపిక్‌ కార్యదర్శి తోటరాజు, అమరేందర్‌రాజు, చిన్నవర సాగర్‌, ఖాజాఖాన్‌, హైదర్‌, అనంద్‌, సాధిక్‌అలీ, అడ్మినిస్ట్రేట్‌ అధికారి సుజాత, ఇతర శాట్స్‌ అధికారులు, మహబూబ్‌నగర్‌ డీవైఎస్‌ఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-24T11:14:02+05:30 IST