లక్షా 45వేల మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు సహాయం

ABN , First Publish Date - 2021-04-09T21:54:56+05:30 IST

రాష్ట్రంలో పాఠశాలల మూసివేతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఒక లక్షా 45వేల మంది ప్రైవేట్

లక్షా 45వేల మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు సహాయం

హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలల మూసివేతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఒక లక్షా 45వేల మంది ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు సహాయం అందనుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు అందజేసే సహాయంపై బీఎర్కే భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. అనంతరం మంత్రి వివరాలు వెల్లడించారు.


కరోనాతో ప్రపంచమంతా అతలాకుతలమవుతోందని, ఈ కారణంగానే ప్రస్తుతం తాత్కాలికంగా పాఠశాలలు మూసేశామని మంత్రి పేర్కొన్నారు. పాఠశాలల మూసివేతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను దేశంలో ఎక్కడా లేని విధంగా వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. అన్నివర్గాల ప్రజలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా ప్రభుత్వం ఆదుకుంటున్నారన్నారు.


 రాష్ట్రంలో దాదాపు 10,500 స్కూళ్లలో లక్ష 45వేల మంది పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రైవేటు టీచర్లు, స్కూళ్ళల్లో పనిచేస్తున్న సిబ్బందికి 2,000 వేల రూపాయలు, 25 కిలోల బియ్యం ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వారందరికీ ఈ సహాయాన్ని అందించాలని కలెక్టర్లను ఆదేశించామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Updated Date - 2021-04-09T21:54:56+05:30 IST