కరోనాపై ప్రజలు భయపడాల్సిన అక్కర్లేదు : మంత్రి చెల్లుబోయిన

ABN , First Publish Date - 2020-08-03T21:46:19+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి ప్రజలు భయపడాల్సిన అక్కర్లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి

కరోనాపై ప్రజలు భయపడాల్సిన అక్కర్లేదు : మంత్రి చెల్లుబోయిన

అమరావతి : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి ప్రజలు భయపడాల్సిన అక్కర్లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఇవాళ రాజమండ్రిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. కోవిడ్ కేర్ సెంటర్‌లో ఆస్పత్రిలో అన్ని సదుపాయాలను ప్రభుత్వం సమకూర్చిందన్నారు. కరోనా సోకిన వారిని కోవిడ్ కేర్ సెంటర్‌లకు తరలించి అన్ని సదుపాయాలతో చికిత్స అందిస్తున్నారని ఆయన తెలిపారు. కరోనాతో కలిసి జీవించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగానే జరుగుతోందని.. కరోనా సోకిన వారికి అన్ని విధాలుగా వైద్య సేవలు అందిస్తున్నారని మంత్రి వెల్లడించారు.


కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాత్రికి రాత్రి అన్ని సదుపాయాలు కల్పించాలంటే సాధ్యం కాదన్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని.. కరోనాపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు మాత్రమే పరీక్షలు చేయించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.

Updated Date - 2020-08-03T21:46:19+05:30 IST