నగర పంచాయతీల్లో ‘కలైంజర్‌ క్యాంటీన్లు’

ABN , First Publish Date - 2022-07-06T15:13:19+05:30 IST

నగర పంచాయతీల్లో త్వరలో ‘కలైంజర్‌ క్యాంటీన్లు’ ఏర్పాటుచేయనున్నట్లు ఆహార శాఖ మంత్రి చక్రపాణి తెలిపారు. దేశంలో పౌష్ఠికాహార భద్రతపై

నగర పంచాయతీల్లో ‘కలైంజర్‌ క్యాంటీన్లు’

                                     - మంత్రి చక్రపాణి


పెరంబూర్‌(చెన్నై), జూలై 5: నగర పంచాయతీల్లో త్వరలో ‘కలైంజర్‌ క్యాంటీన్లు’ ఏర్పాటుచేయనున్నట్లు ఆహార శాఖ మంత్రి చక్రపాణి తెలిపారు. దేశంలో పౌష్ఠికాహార భద్రతపై మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాల ఆహార శాఖా మంత్రులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి చక్రపాణి మీడియాతో మాట్లాడుతూ, ఆహార శాఖకు రూ.2 వేల కోట్ల సబ్సిడీ ఇవ్వాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో రేషన్‌ దుకాణాల్లో 98 శాతం బయోమెట్రిక్‌ విధానంలో సరుకులు అందజేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నగర పంచాయతీల్లో కలైంజర్‌ క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.

Updated Date - 2022-07-06T15:13:19+05:30 IST