అమరావతి: ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలతో ఏపీ మంత్రి బుగ్గన సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాలతో వేర్వేరుగా ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తోంది. మంత్రి బుగ్గన, సీఎస్ సమీర్‌శర్మలతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. పీఆర్సీ సహా ఉద్యమ కార్యాచరణపై చర్చ జరుగుతోంది. అంతకుముందు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించాల్సి ఉండగా సాయంత్రం 6.30 గంటలకు వాయిదా పడింది. సీఎస్ సీఎం క్యాంప్ కార్యాలయంకు వెళ్లడంతో సమావేశం 2 గంటలు వాయిదా పడింది.