Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిర్మల సీతారామన్‌తో మంత్రి బుగ్గన భేటీ

ఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్‌తో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి భేటీ అయ్యారు. మద్యం ఆదాయంపై అప్పు చేయడంపై వివరణ ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు, తద్వారా అప్పులు చేయడం.. రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. బుగ్గన వెంట వైసీపీ ఎంపీలు, ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌, ఆర్థికశాఖ అధికారులు ఉన్నారు. ఏపీ ప్రభుత్వ వివరణపై నిర్మలా సీతారామన్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకే అప్పులు తెచ్చుకోవాలని సూచించినట్లు సమాచారం.


Advertisement
Advertisement