ఐదుకోట్ల మందిని ఉద్యోగులు శాసిస్తామంటే ఎలా: మంత్రి బొత్స

ABN , First Publish Date - 2022-01-29T02:28:23+05:30 IST

రాష్ట్రంలోని ఐదుకోట్ల మందిని ఉద్యోగులు శాసిస్తామంటే ఎలా

ఐదుకోట్ల మందిని ఉద్యోగులు శాసిస్తామంటే ఎలా: మంత్రి బొత్స

విశాఖపట్నం: రాష్ట్రంలోని ఐదుకోట్ల మందిని ఉద్యోగులు శాసిస్తామంటే ఎలా అని మంత్రి బొత్స సత్య నారాయణ అన్నారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ బావుందని చెప్పి గతంలో ఉద్యోగులు క్షీరాభిషేకాలు చేశారని ఆయన గుర్తు చేశారు. కొద్ది గంటల తర్వాత వారిలో మార్పు వచ్చిందన్నారు. ప్రభుత్వం చెప్పిన దానికి అంగీకరించి మళ్లీ ఎందుకు కాదని అంటున్నారని ఆయన ప్రశ్నించారు. తమకు బేషజాలు లేవన్నారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరం అవుతాయన్నారు. చర్చలకు ఉద్యోగులు రాకపోతే ఎలా అని ఆయన అన్నారు. ఇలాంటి ఉద్యమాలు ఎప్పుడూ గతంలో చూడలేదన్నారు.


చర్చలకు వచ్చి ఉంటే జీతాలు తగ్గవని లెక్కలు వేసి చూపించే వాళ్ళమన్నారు. ఈ పాటికి జీతాల బిల్లులు కూడా సిద్దమయ్యేవన్నారు. తాము చెప్పిందే కరెక్ట్ అనడంలేదన్నారు. మీ అభ్యంతరాలను  కూడా వారు ప్రస్తావించవచ్చన్నారు. ఉద్యోగులు ఐదుకోట్ల మందిని శాసిస్తామంటే ఎలా అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని అడిగారని, ఇప్పుడేమో మళ్లీ వక్రీకరించి మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు జీతంలో రూపాయి కూడా తగ్గదన్నారు. చర్చలకు పిలిస్తే రాకపోవడం ఏంటని,  ప్రభుత్వం అంటే ఏమనుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. 


జిల్లాల ఏర్పాటులో ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం నడచుకుంటున్నామని ఆయన తెలిపారు. జిల్లాలపై ప్రజలు తమ అభిప్రాయాలు వెల్లడించవచ్చన్నారు. జిల్లాలకు ఎవరి పేరు పెట్టాలన్నది  చర్చించుకున్నాక  ఖరారు చేసుకోవచ్చన్నారు. 

Updated Date - 2022-01-29T02:28:23+05:30 IST