అనంతపురం: ఆరోగ్య సిబ్బందిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీకు ఉద్యోగం కావాలా ఇష్యు కావాలా’ అంటూ మండిపడ్డారు. బొత్సకు వినతిపత్రం ఇచ్చేందుకు యూసీహెచ్‌సీ సిబ్బంది వచ్చింది. తమ సేవలను యదావిధిగా ఉంచాలంటూ కోరారు. సమస్య వివరించే ప్రయత్నం చేసినా మంత్రి వారిని గట్టిగా వారించారు.