ఆయన ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేడు...

ABN , First Publish Date - 2022-01-23T17:01:05+05:30 IST

రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మురుగేశ్‌ నిరాణిపై సొంత పార్టీ నుంచే విమర్శలు దాడి వెల్లువెత్తుతోంది. ఆయన తీరును సొంత పార్టీ నాయకులే తీవ్రంగా ఖండిస్తున్నారు. నిరాణి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని పార్టీ

ఆయన ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేడు...

- Minister నిరాణిపై విమర్శల వెల్లువ 

- సీఎం పదవి కోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారం 

- సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత


బెంగళూరు: రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మురుగేశ్‌ నిరాణిపై సొంత పార్టీ నుంచే విమర్శలు దాడి వెల్లువెత్తుతోంది. ఆయన తీరును సొంత పార్టీ నాయకులే తీవ్రంగా ఖండిస్తున్నారు. నిరాణి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని పార్టీ సీనియర్‌ నేత, విజయపుర ఎమ్మెల్యే బసనగౌ పాటిల్‌ యత్నాళ్‌ తనదైన శైలిలో విమర్శించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ జన్మకు ఆ అవకాశం ఉండదన్నారు. కాగా వారం రోజులక్రితం మంత్రి నిరాణి సీఎం పదవి కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరిగింది. ఆ వెంటనే నిరాణి తానెప్పుడూ ముఖ్యమంత్రి కాదలచుకోలేదని, అటువంటి ఆలోచన లేదన్నారు. సీఎం బసవరాజ్‌ బొమ్మైతో మూడు దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. ఇద్దరం ఒకే కళాశాలలో చదివామని, ఇద్దరి మధ్యా సంబంధాలు బాగున్నాయన్నారు. తరచూ కలుస్తామని, ఆయన వేరు నేను వేరు కాదన్నారు. అయినా పార్టీలో నిరాణి తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. పంచమసాలి మూడో పీఠం ఏర్పాటు కావాలనేదేనా ఆలోచన అనే నిరాణి వ్యాఖ్యలపై కూడల సంగమ పీఠం బసవమృత్యుంజయ స్వామిజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. బెంగళూరులో స్వామిజీ మీడియాతో మాట్లాడుతూ స్వార్థం కోసం సమాజంలో చీలికలు తీసుకురావద్దంటూ హెచ్చరించారు. గ్రామస్థాయిలో పీఠాల ఏర్పాటు తమకు అభ్యంతరం లేదన్నారు. పంచమసాలి పీఠం సమైక్యంగా ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌, పంచమసాలి జాతీయ అధ్యక్షుడు విజయానంద కాశప్పనవర్‌ పోరాటం చేశారని, తమ లక్ష్యం సమాజంలోని పేదలకు రిజర్వేషన్‌ ద్వారా న్యాయం కలగాలని మాత్రమేనన్నారు. కానీ రాజకీయాలకోసం కాదన్నారు. 2ఏ రిజర్వేషన్‌ వస్తే తమకు మంచి పేరు వస్తుందనే నిరాణికి భయం పుట్టుకుందన్నారు. మూడో పీఠం ఏర్పాటు చేస్తే మేం భయపడమన్నారు. ఇటీవలే రాజకీయ మార్పులవేళ సీఎం హోదాకు పేరు ప్రస్తావించాలని నిరాణి సూచించారన్నారు. ఎప్పుడు హోదా తప్పిందో... అప్పటి నుంచే తమపై వ్యతిరేకంగా ఉన్నారన్నారు. పంచమసాలి పీఠం ఇంతకాలం ఇలా కొనసాగేందుకు ఎందరో త్యాగుల బలిదానం ఉందన్నారు. 712 కిలోమీటర్లు పాదయాత్ర చేశామని గుర్తు చేశారు. మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటే మాకు అభ్యంతరం లేదని, అయితే సమాజాన్ని వాడరాదన్నారు. 



Updated Date - 2022-01-23T17:01:05+05:30 IST