గుంటూరు: జిల్లాలోని కొండవీడును పర్యాటక కేంద్రంగా, ఆహ్లాదకరమైన ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కొండవీడులో అభివృద్ధి పనులకు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీతో కలిసి మంత్రి బాలినేని శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండవీడు అభివృద్ధి కోసం 13.5 కోట్లను సీఎం జగన్ కేటాయించారన్నారు. కొండవీడు అభివృద్ధికి వైఎస్ నాంది పలికారని, దానిని జగన్ పూర్తి చేస్తారన్నారు. సుబ్బరావు గుప్తా మతి స్థిమితం లేని వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. అతని మాటలు పట్టించుకోకూడదన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు. జనసేన అధినేత పవన్, బీజేపీతో కలవాలని చంద్రబాబు మళ్ళీ ప్రయత్నిస్తున్నాడని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్‌ను ఓడించలేడని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి