Advertisement
Advertisement
Abn logo
Advertisement

చిరుకు రాజ్యసభ సీటుపై మంత్రి బాలినేని తాజా రియాక్షన్

ప్రకాశం: ముఖ్యమంత్రి జగన్‌, మెగాస్టర్ చిరంజీవి భేటీ అనంతరం చిరుకు రాజ్యసభ సీటు ఇస్తున్నారంటూ వచ్చిన రూమర్స్‌పై  మంత్రి బాలినేని శ్రీనివాస్ స్పందించారు. సినిమా వాళ్లకి ఉన్న ఇబ్బందులు గురించి చెప్పడానికి మాత్రమే సీఎం జగన్‌ను చిరంజీవి కలిశారని స్పష్టం చేశారు. కొంత మంది దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సినిమా వాళ్ల తరపున వచ్చి చిరంజీవి కలిస్తే ఏదో ఒకటి పులమాలని చూస్తున్నారన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాన్ మధ్య చిచ్చు పెట్టే ఆలోచన జగన్‌కి లేదని తేల్చిచెప్పారు. పార్టీ పెట్టినప్పటి నుండి జగన్ ఒంటరిగానే పోటీ చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు దళితులు, కాపుల మధ్య చిచ్చుపెడుతుంటారని మంత్రి బాలినేని శ్రీనివాస్ మండిపడ్డారు. 


మరోవైపు రాజ్యసభ సీటు వ్యవహారానికి సంబంధించి స్వయంగా చిరంజీవి వివరణ ఇచ్చారు. తాను రాజకీయాలకు దూరమంటూ మెగాస్టార్ తేల్చిచెప్పారు. 

Advertisement
Advertisement