విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ జరగదు: మంత్రి బాలినేని

ABN , First Publish Date - 2020-10-29T00:39:43+05:30 IST

విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ జరగదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ మీటర్ల బిగింపుతో రైతులపై ఎలాంటి భారం ఉండదని

విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ జరగదు: మంత్రి బాలినేని

అమరావతి: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ జరగదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ మీటర్ల బిగింపుతో రైతులపై ఎలాంటి భారం ఉండదని, ఉచితంగానే రైతులకు విద్యుత్ మీటర్లను బిగిస్తామన్నారు. విద్యుత్‌ మీటర్లపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని తప్పుబట్టారు. కేంద్రం తెచ్చిన విద్యుత్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం..దీనిపై లేఖ రాశామని తెలిపారు. రాయలసీమ థర్మల్ ప్లాంట్ విక్రయించడం లేదన్నారు. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై సంఘాలతో చర్చించామని, కాంట్రాక్ట్‌ విద్యుత్ ఉద్యోగుల క్రమబద్దీకరణను పరిశీలిస్తున్నామని బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.


అంతకుముందు విద్యుత్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి బాలినేని శ్రీనివాస్ చర్చలు ముగిశాయి. సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని ఉద్యోగ సంఘ ప్రతినిధులకు మంత్రి హామీ ఇచ్చారు. విద్యుత్ ఉద్యోగుల అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల ఆందోళనపై ప్రభుత్వంతో నాలుగు గంటల పాటు చర్చలు జరిగాయి.

Updated Date - 2020-10-29T00:39:43+05:30 IST