శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శం

ABN , First Publish Date - 2020-05-29T10:28:19+05:30 IST

ఉపాధ్యాయుడిగా జీవి తాంతం నిబద్ధతతో పనిచేసిన శ్రీరాములు మా స్టారు భావితరాలకు ఆదర్శప్రాయుడని పలువు రు ..

శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శం

సంతాపసభలో పలువురు ప్రముఖులు  

నివాళులర్పించిన మంత్రి బాలినేని  


మద్దిపాడు, మే 28: ఉపాధ్యాయుడిగా జీవి తాంతం నిబద్ధతతో పనిచేసిన శ్రీరాములు మా స్టారు భావితరాలకు ఆదర్శప్రాయుడని పలువు రు ప్రముఖులు పేర్కొన్నారు. ఇటీవల అనారో గ్యంతో మృతి చెందిన ఎస్టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు ఐనేని శ్రీరాములు సంతాపసభ గు రువారం ఆయన స్వగ్రామమైన మద్దిపాడు మ ండలం బసవన్నపాలెంలో గురువారం జరిగిం ది. ఈ సందర్భంగా సీనియర్‌ కమ్యూనిస్టు నా యకుడు నల్లూరి వెంకటేశ్వర్లు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు బాచిన చెంచుగరటయ్య, పాలపర్తి డేవిడ్‌రాజు, ముక్కు ఉగ్రనరసింహారరెడ్డి  కసుకుర్తి ఆదెన్న, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రావుల వెం కయ్య, జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ తది తరులు శ్రీరాములు చిత్రపటానికి పూలమాల లు వేసి ఘనంగా నివాళులర్పించారు.


అనంత రం శ్రీరాములు మాస్టారు కుమారుడు, ఏపీ యూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ.సుబ్బారావు మాట్లాడుతూ తన తండ్రి చూపిన మార్గంలో వ్యక్తిగతంగా చివరి వరకు కమ్యూనిస్టుగానే కొ నసాగుతానని తెలిపారు. కాగా మంత్రి బాలినే ని శ్రీనివాసరెడ్డి మధ్యాహ్న సమయంలో అక్క డికి విచ్చేసి శ్రీరాములు చిత్రపటానికి ని వాళులర్పించారు. అనంతరం ఐవీ.సుబ్బారావు తో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామ ర్శించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వైసీపీ ఇ న్‌చార్జి బాచిన కృష్ణచైతన్య, కరణం వెంకటేష్‌, పలు పార్టీల నాయకులు ఆర్‌.రవీంద్రనాధ్‌, కే వీ.ప్రసాద్‌, యు.ప్రకాశరావు, ఎంసీ.వెంకటేశ్వర్లు, ఎం.వెంకయ్య, జీవీ.కొండారెడ్డి, ఎంఎస్‌.సాయి, లలితకుమారి, మండవ రంగారావు, చల్లా శ్రీ నివాసరావు, కడియాల ప్రసాద్‌, ఐవీ.సారథి, చుండూరిరంగారావు, చుంచు శేషయ్య, దారప నేని చంద్రశేఖర్‌, మన్నం శ్రీధర్‌బాబు, మండవ జయంతిబాబు, నల్లూరి చంద్రశేఖర్‌, టీవీ.శేషు, ప్రకాశం ఇంజనీరింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌ కంచర్ల రామయ్య, జర్నలిస్టుల యూనియన్‌ జాతీయ నాయకుడు ఆలపాటి సురేష్‌, ఏపీ యూడబ్ల్యూజే జిల్లా నాయకులు మాధవరెడ్డి, కనకయ్య, ఎ.సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-29T10:28:19+05:30 IST