రమ్య హత్య తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: మంత్రి అవంతి

ABN , First Publish Date - 2021-08-17T18:03:51+05:30 IST

విద్యార్థిని రమ్య హత్యకు గురికావడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.

రమ్య హత్య తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: మంత్రి అవంతి

విశాఖపట్నం: విద్యార్థిని రమ్య హత్యకు గురికావడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలుపుతున్నానని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు దిశ యాప్ ద్వారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తే నిందితులకు కఠిన శిక్ష పడుతుందన్నారు. పని లేని ప్రతిపక్షం రాష్ట్రంలో ఉందని, నారా లోకేష్ గ్రామ స్థాయి నాయకుల కంటే హీనంగా ముఖ్యమంత్రిపై మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, స్థాయిని దిగజార్చుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పరామర్శకి వెళ్లి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారన్నారు. కుల రాజకీయాలు మానుకోవాలన్నారు. రమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి అవంతి స్పష్టం చేశారు.

Updated Date - 2021-08-17T18:03:51+05:30 IST