గంటా శ్రీనివాసరావు అరెస్ట్ అవ్వొచ్చు: మంత్రి అవంతి శ్రీనివాస్

ABN , First Publish Date - 2020-07-16T23:29:48+05:30 IST

మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అరెస్ట్ అవ్వొచ్చని..

గంటా శ్రీనివాసరావు అరెస్ట్ అవ్వొచ్చు: మంత్రి అవంతి శ్రీనివాస్

విశాఖ: మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అరెస్ట్ అవ్వొచ్చని అన్నారు. చంద్రబాబు హయాంలో మంత్రులంతా అవినీతిలో కూరుకుపోయారని చెప్పారు. టీడీపీ నేతలు ఐదేళ్ల కాలంలో దేన్ని వదిలిపెట్టలేదన్నారు. ఇప్పటికే అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర అరెస్ట్ అయ్యారని వ్యాఖ్యానించారు. మధురవాడలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2020-07-16T23:29:48+05:30 IST