ఇండోర్‌ స్టేడియం ఏర్పాటుకు మంత్రి హామీ : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-01-19T05:54:04+05:30 IST

దేవరకొండలో షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ తెలిపారు. దేవరకొండ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌వీటీ, సభ్యులు, ఎమ్మెల్యేతో కలిసి హైదరాబాద్‌లో మంత్రిని సోమవారం కలిశారు. ఇండోర్‌ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా

ఇండోర్‌ స్టేడియం ఏర్పాటుకు మంత్రి హామీ : ఎమ్మెల్యే
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసిన ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

దేవరకొండ, జనవరి 18: దేవరకొండలో షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే  రమావత్‌ రవీంద్రకుమార్‌ తెలిపారు. దేవరకొండ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌వీటీ, సభ్యులు, ఎమ్మెల్యేతో కలిసి హైదరాబాద్‌లో మంత్రిని సోమవారం కలిశారు. ఇండోర్‌ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి రూ.2.51కోట్లతో దేవరకొండలో త్వరలో ఇండోర్‌స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. మంత్రిని కలిసినవారిలో స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి శ్రీధర్‌గౌడ్‌, కోశాధికారి కృష్ణకిశోర్‌ ఉన్నారు. అదేవిధంగా దేవరకొండలోని 6వ వార్డులో సీసీరోడ్డుకు ఎమ్మెల్యే రవీ ంద్రకుమార్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. పట్టణంలో పారిశుఽ ద్య నివారణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, మార్కెట్‌ చైర్మన్‌ శిరందాసు లక్ష్మమ్మ కృష్ణయ్య, కౌన్సిలర్‌ గోపాల్‌దాస్‌ చెన్నయ్య, హనుమంతు వెంకటేష్‌గౌడ్‌, వడ్త్య దేవేందర్‌నాయక్‌, కమిషనర్‌ వెంకటయ్య, కౌన్సిలర్‌ రైసొద్దిన్‌, కోఆప్షన్‌ సభ్యుడు లింగయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T05:54:04+05:30 IST