Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంత్రి అప్పలరాజు క్షమాపణ చెప్పాలి

ప్రత్తిపాడు, డిసెంబరు 6: మంత్రి అప్పలరాజు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు సచివాలయ విధులకు హాజరుకాబోమని వీఆర్వోలు హెచ్చరించారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మండల వీఆర్వోలు 4వరోజు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు బెంచీలు ఏర్పాటు చేసుకుని వారు విధులు నిర్వహించారు. వీఆర్వోలను తరిమికొట్టాలని మంత్రి అప్పలరాజు చెప్పడం దారుణమన్నారు. తక్షణం మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశా రు. ఆందోళనలో వీఆర్వో సంఘ నాయకులు సందక దుర్గాప్రసాద్‌, సాయివర్మ, వీఆర్వోలు వినోద్‌, మల్లికాసులమ్మ, శ్రీనివాస్‌, లక్ష్మి, కోటేశ్వరమ్మ, ప్రసాద్‌, సత్యనారాయణ, అన్నబాబు, దాసు, చిన్ని, భాస్కరరావు, రమేష్‌, రాంబాబు, దిలీప్‌, బాపూజీ, శివ, రాజేష్‌, ఇస్మాయిల్‌, సత్యనారాయణ, శ్యామ్‌, రవి, జక్కయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement