జగన్ ఫొటోతో ఎన్నికలకు చంద్రబాబు: మంత్రి అప్పలరాజు

ABN , First Publish Date - 2022-01-18T20:07:10+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుకు జగన్ ఫొటో పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని మంత్రి అప్పలరాజు అన్నారు.

జగన్ ఫొటోతో  ఎన్నికలకు చంద్రబాబు: మంత్రి అప్పలరాజు

శ్రీకాకుళం: టీడీపీ అధినేత చంద్రబాబుకు జగన్ ఫొటో పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని  మంత్రి అప్పలరాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలు చిరస్మరణీయమన్నారు.జగన్ స్థాయిని చేరుకోవటానికి ఇతర రాష్ట్రాల సీఎంలు పరుగులు పెడుతున్నారన్నారు.ఏపీ లో ఇంగ్లిష్ మీడియంపై చంద్రబాబు కోర్టుకు వెళ్లారని, తెలంగాణలో ఇంగ్లిష్ మీడియంపై జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎలా స్పందిస్తారు? అని ప్రశ్నించారు. పీఆర్సీపై ఎక్కువశాతం మంది ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారన్నారు. కొంతమంది కావాలని ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. 

Updated Date - 2022-01-18T20:07:10+05:30 IST