శ్రీకాకుళం : రాష్ట్రంలో జరుగుతున్న సంస్కరణలు దేశం దృష్టికి తీసుకువెళ్లటమే యాత్ర ఉద్దేశ్యమని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. సమసమాజ స్థాపన చేసిన సంఘ సంస్కర్త జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. మహిళలకు పురుషులతో సమానమైన గౌరవం కల్పించారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అణగారిన వర్గాలకు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని అప్పలరాజు పేర్కొన్నారు.