విజయనగరం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పశుసంవర్దక శాఖ మంత్రి సీదిర అప్పలరాజు విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన విజయనగరం జిల్లా, గరివిడిలో వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనను తప్పు పట్టారు. ఎన్ని శవ యాత్రలు చేసినా చంద్రబాబుని ప్రజలు నమ్మరని అన్నారు. ఆంధ్రాను చూసి తెలంగాణ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పెట్టిందన్నారు. ఏపీలో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించిన చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వ తీరుని ఎందుకు తప్పుపట్టరని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్సా సత్యన్నారాయణ, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాజాం శాసనసభ్యుడు కంబాల జోగులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి