పశ్చిమ గోదావరి: పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ తెలిపారు. వరదలు వచ్చే సమయం లోపల స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, గేట్లు అన్ని పూర్తి చేస్తామన్నారు. అప్పర్, లోయర్ డ్యామ్‌లను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. గోదావరి నీటిని స్పిల్ వే ద్వారా దిగువకు మళ్ళించేందుకు ప్రయత్నం చేస్తామని అనిల్‌కుమార్ పేర్కొన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని ఆయన తెలిపారు.
గత వరదల్లో డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. కాపర్ డ్యామ్ పనులు పూర్తయిన తర్వాత డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు. డ్యామ్ నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పూర్తి క్వాలిటీతో పోలవరం డ్యామ్ నిర్మాణం జరుగుతుందని అనిల్‌కుమార్ తెలిపారు.