గౌతమ్ గురించి మాట్లాడుతూ మంత్రి అనిల్ ఎమోషనల్

ABN , First Publish Date - 2022-02-22T12:21:38+05:30 IST

Minister Anil Kumar Yadav Emotional Words About Makapati Goutham Reddy

గౌతమ్ గురించి మాట్లాడుతూ మంత్రి అనిల్ ఎమోషనల్

  • మంత్రి గౌతమ్‌రెడ్డి మృతికి నేతల సంతాపం
  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి


నెల్లూరు : రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అకాల మృతికి మంత్రులు, ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖు లు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యుల కు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన మృతి రాష్ర్టానికి తీరని లోటని తెలిపారు.


సొంత అన్నను కోల్పోయా : మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతితో సొంత అన్నను, మంచి స్నేహితుడిని కోల్పో యిన బాధ ఏర్పడిందని మంత్రి అనిల్ ఎమోషనల్ అయ్యారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన గొప్ప నేత హఠాత్తుగా మరణించడం పార్టీకే కాదు, ఏపీ ప్రజలకు తీరని లోటు. 


గొప్ప నేతను కోల్పోయాం : ఇన్‌చార్జ్‌ మంత్రి బాలినేని

గొప్ప యువ నేతను కోల్పోయాం. ఆయన లేని లోటు తీర్చలేనిది. శత్రువులను కూడా బాధ పెట్టని మనస్తత్వం గౌతమ్‌రెడ్డిది. 


తీవ్ర దిగ్ర్భాంతి చెందాం : ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి,  ప్రశాంతిరెడ్డి

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి చెందారన్న వార్త విని తీవ్ర దిగ్ర్భాంతి చెందాం. దక్షిణా ఫ్రికా  పర్యటనలో ఉన్న  మేము ఈ వార్త విని జీర్ణించుకోలేకపోయాం.


షాక్‌కు గురయ్యాను : తిరుపతి ఎంపీ గురుమూర్తి

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణ వార్త విని షాక్‌కు గురయ్యాను. నాకు అత్యంత ఆప్తుడై న గౌతమ్‌రెడ్డి మరణం పార్టీకి తీరని లోటు.


కాంగ్రెస్‌ నేత..

మంత్రి గౌతంరెడ్డి మృతికి కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు ఎవరితోనూ విభేదాలు లేని, మచ్చలేని నాయకుడని తెలిపారు. అలాంటి వ్యక్తి మృతి తనను దిగ్ర్భాంతికి గురిచేసిందని తెలిపారు.


సీపీఎం.. 

సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌, జిల్లా మాజీ కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మోహన్‌రావ్‌, యాదగిరి, మాదాల వెంకటేశ్వర్లు, గోగుల శ్రీనివాసులు, వెం కమరాజు, అజయ్‌కుమార్‌, తుళ్లూరు గోపాల్‌, వెంగయ్యలు మంత్రి మృతికి సంతాపం తెలిపారు. 


దొంతు శారద నివాళి

మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ దొంతు శారద నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఆదర్శప్రాయుడైన గౌతమ్‌రెడ్డి మరణం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీరనిలోటని తెలిపారు. 


జనసేన..

రాష్ట్ర పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని జనసేన పార్టీ  పీఏసీ సభ్యుడు  చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2022-02-22T12:21:38+05:30 IST