కరోనా నివారణకు త్వరలో వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2020-08-09T12:00:36+05:30 IST

కరోనా నివారణకు త్వరలోనే వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

కరోనా నివారణకు త్వరలో వ్యాక్సిన్‌

 మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌


నెల్లూరు ( జడ్పీ ), ఆగస్టు 8 : కరోనా నివారణకు త్వరలోనే వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌  తెలిపారు. నగరంలోని 14వ డివిజన్‌లోని బాలాజీనగర్‌, ఏసీ నగర్‌లో ఆయన శనివారం పర్యటించారు. ఈసందర్భంగా స్థానికులను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. డివిజన్‌లో ఎక్కువగా కరోనా సోకి ఉండటంతో నివారణ చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలంతా వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటిస్తే కరోనాకు దూరంగా ఉండవచ్చన్నారు. నగరంలో కరోనా పరీక్షలు ఎక్కువగా చేస్తుండటంతో కేసులు ఎక్కువగా ఉంటున్నాయన్నారు. కరోనాపై ప్రజలు భయపడాల్సిన పని లేదన్నారు. వృద్ధులు, పిల్లలకు జ్వరం, జలుబు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా నివారణకు త్వరలోనే వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 


రూ. 2.5 కోట్లతో ఆర్‌ఎ్‌సఆర్‌ పాఠశాల అభివృద్ధి

నగరంలోని ఆర్‌ఎ్‌సఆర్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌ను రూ.2.5 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. పాఠశాలలో జరుగుతున్న పనులను ఆయన శనివారం పరిశిలించారు. అనంతరం 7వ డివిజన్‌ తోటబడిలో ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు దొంతాలి రఘ, కిన్నెర ప్రసాద్‌, గూడూరు శ్రీధర్‌రెడ్డి, కిన్నెర మల్యాద్రి, నునె మల్లిఖార్జున్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-09T12:00:36+05:30 IST