కవ్వాల్ టైగర్ అటవీ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో మంత్రి అల్లోల
పండుగరోజు కుటుంబసభ్యులతో సరదాగా..
కడెం, జనవరి 15 : నిత్యం తమ పనుల్లో బిజీబిజీగా గడిపే అటవీ, పర్యా వరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కవ్వాల్ అభ యారణ్యంలో కుటుంబసభ్యులతో కలిసి ఉత్సాహంగా గడిపారు. కు టుంబం తో కలిసి శుక్రవారం కవ్వాల్ అభయారణ్యాన్ని సందర్శించిన మంత్రి అక్కడ ఆహ్లాదంగా గడిపారు. మండలంలోని ఉడుంపూర్ అటవీరేంజ్ పరిధిలోని ఇటీవల ఏర్పాటు చేసిన ఐ లవ్ కవ్వాల్ టైగర్ రిజర్వు లోగో వద్ద కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి ఫోటోలు దిగారు. అనంతరం కల్పకుంట వాచ్‌టవర్ ఎక్కి వన్యప్రాణులను, అటవీఅందాలను తిలకించారు. పర్యావరణ పరిరక్షణలో అడవుల పాత్ర, వన్యప్రాణుల సంరక్షణపై మంత్రి తన మనమలు, మనమ రాలికి అవగాహన కల్పించారు. అనంతరం గంగాపూర్ అటవీప్రాంతంలో పర్య టించారు. అంతకుముందు కుటుంబసమేతంగా కడెంప్రాజెక్టును సందర్శించిన మంత్రి కడెం రిజర్వాయర్‌లో బోటు షికార్ చేస్తూ కడెం అందాలను తిలకించి ఆహ్లాదంగా గడిపారు.