ఆ విద్యార్థులంతా పాస్: మంత్రి సురేశ్

ABN , First Publish Date - 2020-07-14T04:01:32+05:30 IST

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలు రాయలేకపోయినా..

ఆ విద్యార్థులంతా పాస్: మంత్రి సురేశ్

అమరావతి: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలు రాయలేకపోయినా.. అడ్వాన్స్ సప్లిమెంటరీలో రాయడానికి దరఖాస్తు చేసుకున్న వారందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్ పరీక్షలు రాయలేకపోయినా పాస్ అయినట్టేనని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు. అన్ని ఎంట్రన్స్ టెస్టులను కూడా వాయిదా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎంసెట్‌తో సహా ఈసెట్, లాసెట్, పీజీ సెట్ లాంటి 8 ప్రవేశ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ మూడో వారానికి ఎంసెట్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులకు మాక్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. ప్రవేశ పరీక్షల నిర్వహణకు త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తామని మంత్రి సురేశ్ పేర్కొన్నారు. 


Updated Date - 2020-07-14T04:01:32+05:30 IST