బాధిత చిన్నారికి మంత్రి పరామర్శ

ABN , First Publish Date - 2020-11-29T05:55:16+05:30 IST

మానవ మృగాలు క్రూరమైన చర్యలకు పాల్పడుతున్న తీరును సమాజంలో ప్రతిఒక్కరూ ఖండించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు.

బాధిత చిన్నారికి మంత్రి పరామర్శ

జీజీహెచ్‌(కాకినాడ), నవంబరు 28: మానవ మృగాలు క్రూరమైన చర్యలకు పాల్పడుతున్న తీరును సమాజంలో ప్రతిఒక్కరూ ఖండించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో కలిసి ఆయన శనివారం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధిత చిన్నారిని పరామర్శించారు. చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. చిన్నారిపై అఘాయిత్యం ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం జగన్‌ బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని, చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారని, రూ.10లక్షల సహాయాన్ని ప్రకటించారని తెలిపారు. నిందుతుడికోసం 15 పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు. మంత్రి వెంట జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు, ఐసీడీఎస్‌ పీడీ డి.పుష్పమణి, డీసీపీవో సీహెచ్‌ వెంకట్రావు ఉన్నారు.

Updated Date - 2020-11-29T05:55:16+05:30 IST