‘పల్లెప్రగతి’పై ఉమ్మడి జిల్లా అధికారులతో నేడు మంత్రి సమీక్ష

ABN , First Publish Date - 2021-06-17T05:35:38+05:30 IST

ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంపై పంచసూత్రాల నిర్వహణపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులకు దిశానిర్ధేశం చేయనున్నారు.

‘పల్లెప్రగతి’పై ఉమ్మడి జిల్లా అధికారులతో నేడు మంత్రి సమీక్ష

 ఖమ్మం కలెక్టరేట్‌, జూన్‌ 16: ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంపై  పంచసూత్రాల నిర్వహణపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులకు దిశానిర్ధేశం చేయనున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశించారు. ఇటీవలే ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో పల్లెల్లో పారిశుధ్యంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యత పనులైన పల్లెప్రగతిలో ఇంకా అలక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నివేదికలు రుజువు చేయడంతో అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మందలించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి  ఖమ్మం జిల్లాలో అధికారులు పంచసూత్రాలను అమలు చేయనున్నారు. పారిశుధ్య నిర్వహణ, తాగునీరు సరఫరా జాగ్రత్తలు, దోమల నివారణ, నిర్మూలన కార్యక్రమాలు, అత్యున్నత స్థాయిలో పారిశుధ్యం నిర్వహణ, వ్యక్తిగత పరిశుబ్రత ఇలా ఐదు అంశాలతో పాటు పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలపై మంత్రి సమీక్షించనున్నారు.  రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నిర్వహించే ఈ సమావేశానికి జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ అఽధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించనున్నారు. ఉదయం 11గంటలకు భక్తరామదాసు కళాక్షేత్రంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమీక్షించనున్నారు. 


Updated Date - 2021-06-17T05:35:38+05:30 IST