పదవులకు వన్నెతేవాలి.. మేయర్‌, డిప్యూటీ మేయర్‌కు మంత్రి పువ్వాడ అభినందన

ABN , First Publish Date - 2021-05-11T06:16:31+05:30 IST

‘రాజకీయాల్లో ఎంతో మందికి రాని అవకాశం మీకు వచ్చింది. పదవులకు వన్నెతెచ్చేలా మీ పనితీరు ఉండాలి’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖమ్మం నూతన మేయర్‌, డిప్యూటీ మేయర్లకు సూచించారు. సోమవారం ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన కొవిడ్‌పై సమీక్షకు హాజరైన మంత్రి పువ్వాడ తొలుత ఖమ్మం కార్పొరేషన్‌కు నూతనంగా ఎన్నికైన మేయర్‌ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌ ఫాతిమా జోహారాను సత్కరిం చారు.

పదవులకు వన్నెతేవాలి.. మేయర్‌, డిప్యూటీ మేయర్‌కు మంత్రి పువ్వాడ అభినందన
నూతనంగా ఎన్నికైన ఖమ్మం నగరపాలక మేయర్‌ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌ ఫాతిమాను సన్మానిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం కలెక్టరేట్‌, మే 10: ‘రాజకీయాల్లో ఎంతో మందికి రాని అవకాశం మీకు వచ్చింది. పదవులకు వన్నెతెచ్చేలా మీ పనితీరు ఉండాలి’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖమ్మం నూతన మేయర్‌, డిప్యూటీ మేయర్లకు సూచించారు. సోమవారం ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన కొవిడ్‌పై సమీక్షకు హాజరైన మంత్రి పువ్వాడ తొలుత ఖమ్మం కార్పొరేషన్‌కు నూతనంగా ఎన్నికైన మేయర్‌ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌ ఫాతిమా జోహారాను సత్కరిం చారు. అనంతరం వారిని ఉద్దేశించి మంత్రి మాట్లా డుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన అవకాశం మే రకు ఖమ్మం నగర అభివృద్ధికి మీ వంతు కర్త వ్యాన్ని నిర్వర్తించాలని కోరారు. ప్రస్తుత కోవిడ్‌ విప త్కర సమయంలో కొవిడ్‌ నివారణ చర్యలను యుద్ధప్రాతినిపదికన చేపట్టాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ అంచనాలకు మించి సుపరిపాలన అందించాలని, మంత్రి కేటీఆర్‌ సహాకారంతో నగ రాన్ని మరింత అభివృద్ధి చేద్దామని అందుకు తాను పూర్తి సహకారాన్ని అందిస్తానన్నారు. అలాగే నూత నంగా ఎన్నికైన కార్పొరేటర్లకు కూడా మంత్రి పువ్వా డ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌, పోలీస్‌ కమిషనర్‌ విష్ణు వారియర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-11T06:16:31+05:30 IST