మైనింగ్‌ గుబులు!!!

ABN , First Publish Date - 2022-06-30T06:45:49+05:30 IST

ప్రత్తిపాడు మండలం చింతలూరులో లేటరైట్‌ తవ్వకాలకు గనులశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. చింతలూరు సత్యశాంతి సంక్షేమ సేవా సంఘానికి ఆ గ్రామ కొండపై సర్వే నెంబరు1లో 36.669 హెక్టార్లు 20ఏళ్లు లీజు అనుమతులు ఇస్తూ గనులశాఖ పచ్చజెండా ఊపింది. దీంతో చింతలూరు కొండపై లేట రైట్‌ మైనింగ్‌లు నిర్వహించేందుకు 15రోజులుగా చకచకగా రహదారి ఏర్పాటు పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.

మైనింగ్‌ గుబులు!!!
చింతలూరులో మైనింగ్‌ లీజులు ఇచ్చిన కొండ ఇదే

  • చింతలూరులో మైనింగ్‌కు గనులశాఖ పచ్చజెండా
  • సత్యశాంతి సంక్షేమ సేవా సంఘానికి 36.669 హెక్టార్లు లేట‘రైట్‌‘
  • 20ఏళ్లపాటు లీజుకు అనుమతులు
  • కొండపై రహదారుల ఏర్పాటు పనులు ప్రారంభం
  • లీజు సరిహద్దు ప్రాంతంలో ఫెన్సింగ్‌లు
  • వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు, రైతులు
  • న్యాయం చేయాలంటూ ఆందోళన

ప్రత్తిపాడు, జూన్‌ 29: ప్రత్తిపాడు మండలం చింతలూరులో లేటరైట్‌ తవ్వకాలకు గనులశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. చింతలూరు సత్యశాంతి సంక్షేమ సేవా సంఘానికి ఆ గ్రామ కొండపై సర్వే నెంబరు1లో 36.669 హెక్టార్లు 20ఏళ్లు లీజు అనుమతులు ఇస్తూ గనులశాఖ పచ్చజెండా ఊపింది. దీంతో చింతలూరు కొండపై లేట రైట్‌ మైనింగ్‌లు నిర్వహించేందుకు 15రోజులుగా చకచకగా రహదారి ఏర్పాటు పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.

గతంలో ఇదే చింతలూరు, గజ్జెనపూడి కొండపై మహేశ్వరి మి నరల్స్‌, పరమేశ్వరి మినరల్స్‌ను పుష్కరకాలంపాటు మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహించాయి. అవి హద్దులు దాటి అక్రమంగా మైనింగ్‌ నిర్వహించాయని అప్పట్లో వివాదం తలెత్తడం, దీనివల్ల పెద్దఎత్తున దుమారం జరగడంతో అప్పట్లో ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, విపక్షాలు పీఏసీ కమిటీ బృందం వంటివి సందర్శించాయి. మళ్లీ ఇప్పుడు చింత లూరులో మైనింగ్‌ నిర్వహణకు సత్యశాంతి సంక్షేమ సేవా సంఘం లీజులు దక్కించుకుంది. చింతలూరు కొండపై 90ఎకరాల్లో లేటరైట్‌ తవ్వకాలకు 20ఏళ్లపాటు ఈ సంస్థలకు లీజులు ఈ ఏడాది జూన్‌ 16 నుంచి మంజూరైనట్లు తెలిసింది. దీంతో లీజులు పొందిన సత్యశాంతి సేవా సంఘం తరుపున నిర్వాహకులు కొండపై లేటరైట్‌ రవాణాకు సంబంధించిన రహదారుల ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టారు.

ఎకరాకు రూ.15లక్షలు చెల్లిస్తేనే..

ఇదే కొండపై 100మంది దళితులకు కొండపోడుసాగు నిమిత్తం ప్రభుత్వ డీ పట్టాలు మంజూరు చేసింది. ఈ భూముల్లో రైతులు మా మిడి, జీడిమామిడి, టేకు తదితర వృక్షాలు పెంచుకుంటూ వాటి ఫల సహాయం పొందుతున్నారు. తాజాగా లీజులు పొందిన వారు వీరిలో 65మందికి లక్ష రూపాయలు వంతున పరిహారం అందజేసి కొండపై రహదారి పనులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 35మంది రైతులు లీజు దారులకు భూములు ఇవ్వలేదు. ఈ క్రమంలో డీ పట్టా భూముల సాగుదారులు 35మంది తమకు ఎకరాకు రూ.15లక్షలు నష్టపరిహారం చెల్లిస్తేనే భూములు ఇస్తామని గంటాపథంగా చెపుతున్నారు. దీనిపై చింతలూరులో 10రోజులుగా సర్పంచ్‌ పండ్రాడ గంగారాము, గ్రామపె ద్ద కర్రి మురళి ఆధ్వర్యంలో బాధిత రైతులు, గ్రామస్తులు పెద్దఎత్తు న ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలో ప్రత్తిపాడుకు చిం తలూరు మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

పంచాయతీ తీర్మానం లేకుండానే..

చింతలూరులో మైనింగ్‌లవల్ల గ్రామం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని, గతంలో గ్రామంలో మైనింగ్‌ వ్యాపారం రూ.1200కోట్లు జరిగినా గ్రామాభివృద్ధికి మైనింగ్‌ నిర్వాహకులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గ్రామ పంచాయతీ మైనింగ్‌ లీజులకు ఎటువంటి తీర్మానాలు మంజూరు చేయలేదని, అయినా లీజులు మంజూరయ్యాయని చెబుతున్నారని, అయినా దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకు గ్రామంలో ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమని గ్రామపెద్ద కర్రి మురళి, సర్పంచ్‌ పండ్రాడ గంగారాము, గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే కొండపై లీజులు రద్దు చేయాలంటూ సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌, ఐజాలా నిజ నిర్ధారణ కమిటీ బృందాలు కూడా డిమాండ్‌ చేస్తూ మైనింగ్‌లను వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో చింతలూరులో లేటరైట్‌ తవ్వకం పనులు ఏ విధంగా చేపడతారనే అంశం ఉత్కంఠభరితంగా మారింది.

Updated Date - 2022-06-30T06:45:49+05:30 IST