మైనింగ్‌ భూమి చదునులో అవినీతి

ABN , First Publish Date - 2020-12-03T06:40:06+05:30 IST

‘మైనింగ్‌ భూములను ఇతర కార్యక్రమాలకు ఉపయోగించకూడదని మైనింగ్‌ శాఖ మంత్రిగా పనిచేసిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలియదా? యరజర్లలో మైనింగ్‌ భూమిని చదును చేయడంలో వైసీపీ అవినీతికి పాల్పడింది’ అని టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ఎన్‌. బాలాజీ విమర్శించారు.

మైనింగ్‌ భూమి   చదునులో అవినీతి


టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బాలాజీ

ఒంగోలు (కార్పొరేషన్‌) డిసెంబరు 2 : ‘మైనింగ్‌ భూములను ఇతర కార్యక్రమాలకు ఉపయోగించకూడదని మైనింగ్‌ శాఖ మంత్రిగా పనిచేసిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలియదా? యరజర్లలో మైనింగ్‌ భూమిని చదును చేయడంలో వైసీపీ అవినీతికి పాల్పడింది’ అని టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ఎన్‌. బాలాజీ విమర్శించారు. బుధవా రం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.టీడీపీ హయాంలో యరజర్లలో ట్రిపుల్‌ ఐటీ పెట్టాలని ప్రయ త్నాలు జరిగాయన్నారు. అక్కడ మైనింగ్‌ భూములు ఉన్న కారణంగా కళాశా ల ఏర్పాటు కుదరదని ప్రభుత్వం చెప్పిన మీదటనే ఆనాటి ఎమ్మెల్యేగా ఉన్న దామచర్ల జనార్దన్‌, టీడీపీ నాయకులు ఒప్పుకున్నారని తెలిపారు. ఆ విషయం మంత్రి బాలినేనికి కూడా తెలుసన్నారు. నిబంధనల ప్రకారం ఖనిజ వనరులు లేదా ఖనిజ సంపద ఉంటే సదరు భూమిని ఇళ్లపట్టాలకు ఇవ్వకూడదన్నారు. ఆ భూమి వ్యవహారం కోర్టు వివాదంలో ఉండగానే చదు నుకు రూ.40కోట్లు వృఽథాగా ఖర్చుచేశారన్నారు.  సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పొదిలి శ్రీనివాసరావు, కామేపల్లి శ్రీనివాసరావు, పి. వెంకటేశ్వర రెడ్డి, షేక్‌ కాలేషా బేగ్‌, అజమ్‌, జాలిరెడ్డి, హరికృష్ణ పాల్గొన్నారు.



Updated Date - 2020-12-03T06:40:06+05:30 IST