గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

ABN , First Publish Date - 2022-05-24T06:20:57+05:30 IST

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన కొమరిపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
కొమరిపాలెంలో సొసైటీ భవనాన్ని ప్రారంభిస్తున్న సుబ్బారెడ్డి

  • టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి
  • కొమరిపాలెంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం 

బిక్కవోలు, మే 23: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన కొమరిపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన సొసైటీ భవనం, రెండు సచివాలయ భవనాలను ప్రారంభించారు. రైసుమిల్లర్ల సహకారంతో నిర్మించే మార్కెట్‌ షెడ్లు, కల్యాణ వేదికకు భూమిపూజ చేశారు. అనంతరం జగన్‌ ముఖ్యమంత్రిగా మూడేళ్లు పూర్తికావడంతో ఆయన కేపీఆర్‌ సంస్థల డైరెక్టర్‌ కొవ్వూరి సత్యనారాయణరెడ్డి ఏర్పాటు చేసిన కేకును కట్‌ చేశారు. కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, జక్కంపూడి రాజా, పెండెం దొరబాబు, శ్రీనివాసనాయుడు,  రుడా చైర్మన్‌ మేడపాటి షర్మిళారెడ్డి, ఎంపీపీ కొవ్వూరి జ్యోతిర్మయి సత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ రొంగల పద్మావతి, ఏఎంసీ చైర్మన్‌ జేవీవీ సుబ్బారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ ఆకుల వీర్రాజు, దవులూరి దొరబాబు, కుడుపూడి చిట్టబ్బాయి, సర్పంచ్‌ వాసంశెట్టి రవికుమార్‌, కేపీఆర్‌ సంస్థల చైర్మన్‌ కొవ్వూరి పాపారెడ్డి, రాష్ట్ర ఫౌలీ్ట్ర ఫెడరేషన్‌ అధ్యక్షుడు కర్రి వెంకటముకుందరెడ్డి, సొసైటి అధ్యక్షుడు తాడి అరవిందం, వైసీపీ మండల కన్వీనర్‌ పోతుల ప్రసాదరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T06:20:57+05:30 IST