‘కల’గా మినీ స్టేడియం

ABN , First Publish Date - 2021-05-07T04:54:19+05:30 IST

విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ఎంతో అవసరం. ఎప్పుడూ విద్య పైనే దృష్టి పెడితే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతారనే ఉద్దేశ్యంతో పాఠశాలలు, కళాశాలల్లో క్రీడలను ఒక భాగం చేశారు. తద్వారా క్రీడల్లో పిల్లలు పట్టు సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపుతున్న వారెందరో ఉన్నారు.

‘కల’గా మినీ స్టేడియం
అసంపూర్తిగా ఉన్న మినీ స్టేడియం

బిల్లులు రాకపోవడంతో ఆగిన పనులు 

ఎక్కడికక్కడ ఆపేసిన కాంట్రాక్టర్‌  

ఆందోళనలో క్రీడాకారులు 


పట్టణంలో మూడేళ్ల కిందట ప్రారంభమైన మినీ స్టేడియం క్రీడా కారులకు ‘కల’గా మిగిలింది. త్వరలో పూర్తవుతుంది.. సాధన చేసేందుకు సౌకర్యంగా ఉంటుందనుకున్న సమ యంలో.. అందరినీ నిరుత్సాహ పరి చింది. సంబంధిత కాంట్రాక్టరుకు బిల్లులు రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. పట్టించుకునే వారు లేకపోవడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళ్తే...


కమలాపురం(రూరల్‌), మే 6: విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ఎంతో అవసరం. ఎప్పుడూ విద్య పైనే దృష్టి పెడితే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతారనే ఉద్దేశ్యంతో పాఠశాలలు, కళాశాలల్లో క్రీడలను ఒక భాగం చేశారు. తద్వారా క్రీడల్లో పిల్లలు పట్టు సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపుతున్న వారెందరో ఉన్నారు. విద్యార్థులనే కాక క్రీడాకారులను ప్రోత్సహించేం దుకు ప్రభుత్వం అక్కడక్కడా మినీ స్టేడియా లను నిర్మించాయి. ఈ క్రమంలో కమలాపురం పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో మినీ స్టేడియాన్ని నిర్మించేందుకు క్రీడా వికాస్‌ కేంద్రం (కేవీఆర్‌) ఆధ్వర్యంలో 2018లో పనులు ప్రారంభించారు. స్టేడియం నిర్మాణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులు కూడా కేటాయించారు. దీంతో పాఠశాల క్రీడా మైదానంలోని పది సెంట్ల స్థలంలో నిర్మాణ పనులు చకచకా మొదలు పెట్టారు. దీంతో పట్టణవాసులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మారడం.. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులను ఎక్కడికక్కడ ఆపేశాడు. ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయిలో ఖోఖో, కబడ్డీ, క్రికెట్‌, వాలీబాల్‌, షటిల్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌ క్రీడల్లో నైపుణ్యం గల క్రీడాకారులున్నారు. వారు సాధన చేసుకునేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఒకింత నిరుత్సా హానికి గురయ్యారు. స్టేడియం పూర్తయి ఉంటే ఉదయం, సాయంత్రం సాధన చేసుకుంటూ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చేందుకు అవ కాశం ఉండేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు.

Updated Date - 2021-05-07T04:54:19+05:30 IST