వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం

ABN , First Publish Date - 2022-05-25T05:49:10+05:30 IST

వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడే రోజులు వచ్చాయని, ఇందుకు టీడీపీ నాయకులు సైనికుల్లా పనిచేయాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.

వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం
బందరు నియోజకవర్గ స్థాయి మినీ మహానాడులో మాట్లాడుతున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

  మినీ మహానాడులో కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణరావు పిలుపు

మచిలీపట్నం టౌన్‌, మే 24 : వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడే రోజులు వచ్చాయని, ఇందుకు టీడీపీ నాయకులు సైనికుల్లా పనిచేయాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.  మచిలీపట్నం టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం రాత్రి  నియోజకవర్గ స్థాయి మినీ మహానాడులో  కొల్లు రవీంద్ర అధ్యక్షత వహించి మాట్లాడారు. వైసీపీ పాలనలో ఎస్సీలపై వేధింపులు ఎక్కువయ్యాయన్నారు.  రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేసేందుకు సీఎం జగన్‌మోహనరెడ్డి వెనుకాడటం లేదన్నారు. అప్పుల ఊబిలో పడి పోయిన రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. సీఎం దావోస్‌ వెళ్లినా ఒనగూరేదేమీ లేదన్నారు.  చంద్రబాబు బందరు పోర్టుకు శంకుస్థాపన చేసి నవయుగకు అప్పగిస్తే రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో వైసీపీ ప్రభుత్వం పోర్టును అటకెక్కించిందన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పేర్ని నాని అనుచరులు అక్రమంగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారన్నారు. మూడేళ్లలో బందరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శూన్యమన్నారు. మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ, ఒంగోలులో రెండు రోజుల పాటు నిర్వహించే మహానాడుకు నాయకులు తరలిరావాలన్నారు. సీనియర్‌ నాయకులు గొర్రెపాటి గోపీచంద్‌, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌, టీడీపీ పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్‌, కార్పొరేటర్లు చిత్తజల్లు నాగరాము, సుధాకర్‌, దేవరపల్లి అనిత, అన్నం ఆనంద్‌, రూరల్‌ పార్టీ అధ్యక్షుడు కుంచే నాని, నగర పార్టీ అధ్యక్షుడు ఎండి ఇలియాస్‌ పాషా, కార్యదర్శి పిప్పళ్ళ కాం తారావు,  లంకిశెట్టి నీరజ, వాలిశెట్టి విమనేష్‌, మరకాని పరబ్రహ్మం, పి.వి. ఫణికుమార్‌, పద్మజ, చిన్నాపురం సర్పంచ్‌ గోపాలరావు,  అంజిబాబు, వసంతకుమారి, సులేమాన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T05:49:10+05:30 IST