Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

జగన్‌ను గద్దె దించాలి

twitter-iconwatsapp-iconfb-icon

ఒక్కఛాన్స్‌ అంటూ ప్రజలను నట్టేట ముంచారు

మినీ మహానాడులో టీడీపీ నేతల ఆగ్రహం

రాష్ట్ర సంక్షేమం కోసం టీడీపీ అధికారంలోకి రావాలి

ఆక్వా రైతులు నాశనమయ్యారు : ఎమ్మెల్యే రామరాజు

రైతులకు బకాయిలు చెల్లించని సీఎం : గన్ని


నిడమర్రు మే 24 : ఒక్కఛాన్స్‌ అంటూ అధికారాన్ని చేపట్టి ప్రజలను నట్టేట ముంచిన జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఏలూరు జిల్లా సమన్వయకర్త గన్ని వీరాంజనేయులు పిలుపు నిచ్చారు. మంగళవారం నిడమర్రులో సుమారు ఐదు వేల మంది కార్యకర్తలతో ఉంగుటూరు నియోజకవర్గస్థాయి టీడీపీ విస్తృత కార్యకర్తల సమావేశం (మినీ మహానాడు) ఘనంగా నిర్వహించారు. ఏలూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకర్గ టీడీపీ సమన్వయకర్తలు పాల్గొ న్నారు. గణపవరం, నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు మం డలాల పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


పాలనకు సీఎం అనర్హుడు 

గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కార్యకర్తలు పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కృషి చేయాలన్నారు. ‘జగన్‌ అరాచక పాలనకు చరమగీతం పాడేం దుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. రైతులు పండించిన పంటకు ధాన్యం బకాయిలు చెల్లించని సీఎం పాలనకు అన ర్హుడు. ఆక్వా రంగాన్ని ఉద్దరిస్తానని, మాయమాటలు చెప్పి అధికారం చేపట్టిన జగన్‌ ఈ రోజున ఆక్వా రంగాన్ని, దాని అనుబంధ రంగాలను అధోగతి పాలు చేశాడ’ని విమర్శించారు. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, నాశిరకం మందు అధిక రేట్లకు అమ్మి ప్రజారోగ్యాన్ని నాశనం చేస్తున్నాడన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త బడేటి చంటి మాట్లాడుతూ జగన్‌ పాలనలో రాష్ట్రం హత్యలకు, అత్యాచారాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని విమర్శించారు. పోలవరం సమన్వయకర్త బొరగం శ్రీనివాస్‌ మాట్లాడుతూ జగన్‌ ప్రజావేదిక కూల్చివేసి రాష్ట్రం పట్ల తన అభిమతం ఏదో చెప్పకనే చెప్పాడన్నారు. పోలవరం పూర్తి చేయలేమని మంత్రి అంబటి రాంబాబు ప్రకటించడం వారి అసమర్ధతకు నిదర్శనమన్నారు. గోపాలపురం మాజీ ఎమ్యెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మధ్య నిషేధం చేస్తా నంటూ అధికారం చేపట్టిన జగన్‌, కొత్త బ్రాండ్‌లతో ప్రజల అనారోగ్యంతో ఆడుకొంటున్నాడన్నారు. కల్తీ సారాకు పది మం దిని పొట్టన పెట్టుకొన్న ప్రభుత్వం అని విమర్శించారు.   తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వలవల బాబ్జి చంద్రబాబు అధికారంలోకి రావాల్సిన అవసరాలను వివరించారు. చింతలపూడి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ మాట్లాడుతూ రాజధాని లేకుండా పాలన చేసిన ఏకైక సీఎంగా జగన్‌ చరిత్రలో నిలిచిపోతారన్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించి మెట్ట రైతాంగం మెడకు ఉరి తాడు వేస్తున్నాడన్నారు. కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ జిల్లాను సరిహద్దులను మార్చినంత సులువుగా రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను జగన్‌ నాశనం చేశాడన్నారు. నూజివీడు సమన్వ యకర్త వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మెట్ట రైతులకు రావా ల్సిన వ్యవసాయ సబ్సిడీలను తొలగించి రైతులను మోసం చేశాడన్నారు. ధాన్యం, మొక్కజొన్న రైతుల పంట సొమ్ము చెల్లించకపోవడం దారణమన్నారు. టీడీపీ నాయకులు ముత్యాల స్వామి, నంద్యాల మదన్‌, ఉనమట్ల సునీత, పాతూరి రామప్రసాద్‌చౌదరి, ఎల్‌కే శ్రీను, అంబటి ఉదయ్‌భాస్కర్‌, పొట్నూరి సింహాచలం, అంబళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


ఆక్వా నాశనమైంది : ఎమ్మెల్యే రామరాజు

ఉండి ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ రాష్ట్రానికి ఎంతో ఆదాయాన్ని ఇచ్చే ఆక్వా రంగాన్ని జగన్‌ నాశనం చేశాడని విమర్శించారు. విద్యుత్‌ సబ్సిడీల తొలగింపు ద్వారా ఆక్వా  రైతులను ఆర్థికంగా నాశనం చేశాడన్నారు. ఆక్వా జోన్‌లకు మాత్రమే విద్యుత్‌ సబ్సిడీ ప్రకటించి మిగతా రైతులపై తీవ్ర భారం మోపారని, దీంతో రైతులకు వేలల్లో బిల్లులు రావడంతో గగ్గోలు పెడుతున్నారన్నారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.